రేపటి నుంచి సరస్వతీ పుష్కరాలు
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Mounikadesk
రేపటి నుంచి సరస్వతీ పుష్కరాలు
తెలంగాణ :
తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరంలో రేపటి నుంచి ఈనెల 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాళేశ్వరం వద్ద త్రివేణీ సంగమం( గోదావరి, ప్రాణహిత, సరస్వతి) వద్ద పుష్కరాలు జరుగును. అలాగే అలహాబాద్ త్రివేణి సంగమం
వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో సరస్వతీ పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం తెలంగాణలోని కాళేశ్వరం కావడం విశేషం. ఇక్కడ ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని సరస్వతి నది పుష్కరాల్లో పాల్గొనవచ్చు
Comments
