రాష్ట్ర గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, స్పీకర్, విద్యాశాఖ మంత్రి జిల్లా పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, స్పీకర్, విద్యాశాఖ మంత్రి జిల్లా పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
ప్రోటోకాల్ ఏర్పాట్లు జాగ్రత్తగా ఉండాలి
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
రాష్ట్ర గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, శాసనసభ స్పీకర్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి, తదితరులు అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారని, ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్న, రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, తదితరుల జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయా శాఖల జిల్లా అధికారులు, జేఎన్టీయూ విసి, ఇతర మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జేఎన్టీయూ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గవర్నర్ 17వ తేదీన ఉదయం రైలు ద్వారా అనంతపురం చేరుకుంటారని, అనంతరం జేఎన్టీయూ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొని అదే రోజు సాయంత్రం గంటలకు రైలు ద్వారా బయలుదేరి వెళ్తారన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఓవరాల్ ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్ ఉంటారన్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అధికారుల టీం, వాహనాలు, లైజెన్ అధికారులు ఉండాలని, వాహనాల కాన్వాయ్ లో అంబులెన్స్ ఉండాలని, భోజన ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలన్నారు. జేఎన్టీయూలో డయాస్ ప్రణాళిక ప్రకారం జరగాలని, 16వ తేదీన డ్రస్ రిహార్సల్స్ చేయాలని, అడ్వాన్సుడ్ సెక్యూరిటీ లైయిజన్ (ఏఎస్ఎల్) కార్యక్రమం నిర్వహించాలన్నారు. సెక్యూరిటీ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు.
- ఈనెల 15, 16, 17 వ తేదీలలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలో పర్యటించనున్నారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టాలన్నారు. 15వ తేదీన మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా గుత్తి పట్టణంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు మంత్రి చేరుకుంటారని, అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అదేరోజు రాత్రికి గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో బస చేస్తారన్నారు. 16వ తేదీన ఉదయం 10 గంటలకు గుత్తి మండలం బేతపల్లి గ్రామం వద్ద రెన్యూ విండ్ ఎనర్జీ (జెఎఎంబి) ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, అదే రోజు అనంతపురంలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయాలని, అన్ని చోట్ల పూర్తిస్థాయి ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని, అధికారుల మధ్య సమన్వయం, సమాచారం ఉండాలన్నారు. అలాగే 16వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్న, రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, తదితరులు జిల్లా పర్యటనకు రానున్నారని, ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ అరేంజ్మెంట్లు పటిష్టంగా చేయాలన్నారు. ఒక్కొక్కరికి ఒక టీం ఏర్పాటు చేయాలని, రాష్ట్ర గవర్నర్, విద్యాశాఖ మంత్రికి సంబంధించిన వాహనాలు ఏర్పాటు, విఐపి సెక్యూరిటీ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. గుత్తిలో జరిగే కార్యక్రమానికి సంబంధించి గుంతకల్ ఆర్డీవో ఇన్చార్జిగా ఉంటారని, ఎమ్మెల్యే కూతురు వివాహానికి సంబంధించి అనంతపురం ఆర్డీవో ఇన్చార్జిగా ఉంటారని, జేఎన్టీయూ కార్యక్రమానికి సంబంధించి హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్డిసి మల్లికార్జునుడు ఇన్చార్జిగా ఉంటారని, ఆర్.అండ్.బి గెస్ట్ హౌస్ దగ్గర ఏర్పాట్లకు సంబంధించి హెచ్.ఎల్.సి ఎస్డిసి రామ్మోహన్ ఇన్చార్జిగా ఉంటారన్నారు. విఐపిల జిల్లా పర్యటనకు సంబంధించి అన్ని విధాల సిద్ధం కావాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
- ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మాలోల, ఆర్డిఓ కేశవ నాయుడు, టౌన్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి దేవి, తహసీల్దార్ హరిప్రసాద్, నెడ్క్యాప్ డీఎం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
