రాజీవ్ గాంధీ మానవీయత.. వాజపేయి కృతజ్ఞత.. ఒకదానికి మించి మరొకటి! ఏదీ తీసిపోదు.
రాజీవ్ గాంధీ మానవీయత.. వాజపేయి కృతజ్ఞత.. ఒకదానికి మించి మరొకటి! ఏదీ తీసిపోదు.
1988లో విపక్ష నేతగా ఉన్న సమయంలో వాజపేయి గారికి అప్పటికే ఒక కిడ్నీ దెబ్బతింది.. మరో కిడ్నీకి కూడా సమస్యలు రావడంతో అమెరికాకు వెళ్లి తక్షణమే వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచించారు. వాజపేయి గారికి అమెరికా వెళ్లి.. ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత, ఆర్ధిక వెసులుబాటు లేదు.
ఈ విషయం నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారికి తెలిసింది. అమెరికాకు వెళ్లే దౌత్యవేత్తల లిస్టులో వాజపేయి గారి పేరును చేర్చి స్వయానా వాజపేయికి కబురు చేశారు రాజీవ్. వైద్యం ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. పూర్తి ఆరోగ్య వంతులై తిరిగి రండి అని వాజపేయి గారికి రాజీవ్ సూచించారు. ఈ విషయం ఎక్కడా బయటపడకుండా గోప్యంగా ఉంచారు. తాను వాజపేయి వైద్యానికి సహాయపడ్డానని రాజీవ్ ఎక్కడా చెప్పుకోలేదు.
1991లో రాజీవ్ గాంధీ గారి మరణానంతరం వాజపేయి గారు మాట్లాడుతూ.. తాను బ్రతికి ఉండడానికి రాజీవ్ కారణమన్నారు. తనను అమెరికా దౌత్యవేత్తల లిస్టులో సభ్యునిగా చేర్చి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని, తన వైద్యానికి డబ్బులను ప్రభుత్వం చెల్లించేలా సహాయం చేశారని వాజపేయి తెలిపారు.
రాజీవ్ గాంధీ పార్టీల అంతరాలను మరచి గోప్యంగా సహాయం చేయడం.. తనకు సహాయపడిన రాజీవ్ గురించి వాజపేయి ప్రజలందరికీ తెలియపర్చడం.. ఈ రెండూ మనకు స్ఫూర్తినిస్తాయి.
నేడు అలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు లేవు. దేశం-మానవత్వం ముందు.. పార్టీలు తరువాత అని అనుకునే రాజకీయ నేతలూ లేరు.