రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వైసీపీ మద్యం కుంభకోణంపై సరైన రీతిలో విచారణ సాగుతోంది

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

వైసీపీ మద్యం కుంభకోణంపై సరైన రీతిలో విచారణ సాగుతోంది


రేషన్ పంపిణీకి ఎండీయూ వాహనాల వల్ల ఒరిగిందేం లేదు

కుంకీ ఏనుగుల రాకతో మదపుటేనుగుల సమస్యకు పరిష్కారం

మానవతా దృక్పథంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది

ఉగ్రవాదుల ఏరివేతలో కేంద్రానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

ఉగ్రవాదుల గుర్తింపులో ప్రజల్లోనూ చైతన్యం అవసరం

విజయవాడ విమానాశ్రయంలో జాతీయ మీడియాలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  

‘రాష్ట్రంలో మదపుటేనుగులు, వాటి గుంపు సమస్య ఎప్పటి నుంచో ఉంది. మనుషులు – ఏనుగుల మధ్య ఉన్న ఈ సున్నితమైన సమస్య కారణంగా వందలాది ఎకరాల్లో పంటలు నాశనమవుతుంది. పదుల సంఖ్యలో మానవ ప్రాణాలు పోయాయి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి అందించిన కుంకీ ఏనుగుల వల్ల చాలా వరకు అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో సమస్య సమసిపోతుందని భావిస్తున్నాన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  అన్నారు. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం 4 ఏనుగులను అందించిందని, మరో రెండు, మూడు వారాల్లో మిగిలిన ఏనుగులు వస్తాయని చెప్పారు. కుంకీ ఏనుగులను కుప్పంలోని ప్రత్యేక శిక్షణ కేంద్రానికి తరలించి తగిన శిక్షణ అందిజేస్తామని, అవసరం అయిన సమయంలో వాటి సాయం తీసుకుంటామన్నారు. బుధవారం రాత్రి విజయవాడ విమానాశ్రయంలో  పవన్ కళ్యాణ్  జాతీయ మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ ఏనుగుల సమస్యను చెప్పినప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించింది. కర్ణాటక ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య గారు, ఉప ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ , అటవీశాఖ మంత్రి  ఈశ్వర్ ఖండ్రే  సమస్య పరిష్కారం కోసం కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు చొరవ చూపారు. కర్ణాటక అడవుల్లోనూ 3,600 ఏనుగులున్నట్లు చెప్పారు. కుంకీ ఏనుగులతో అక్కడి వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. అయినప్పటికీ మన సమస్యను అర్ధం చేసుకొని కుంకీ ఏనుగులను ఇవ్వడం అభినందనీయం. 

 ఉగ్రవాదులతో చేసేది యుద్ధం కాదు... ఏరివేత

భారత ఉప ఖండంలోని ప్రజలపై ఇష్టానుసారం దాడులు చేసే ఉగ్రవాదులపై మన సైన్యం చేసేది యుద్ధం అనకూడదు. యుద్ధం అంటే రెండు దేశాల మధ్య, వారి సైనిక పటాలాలకు మధ్య జరిగే ఘర్షణ.. యుద్ధం అంటారు. ఉగ్రవాదులు అక్రమంగా దేశంలోకి చొరబడి ఇక్కడి ప్రజలను చంపాలని ప్రణాళిక వేస్తే, వారిని అడ్డుకోవడం యుద్ధం కిందకు రాదు. కాశ్మీర్ లోని కాశ్మీరి పండిట్లపై దాడులు చేసి, వారిని భయబ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి పారిపోయేలా చేయడం యుద్ధం కిందకు రాదు. 1980 ప్రాంతాల్లో ఇది నిరంతరాయంగా సాగింది. ఇప్పుడు కూడా ఆ పద్ధతిలో వెళ్తామంటే జాతీయ నాయకత్వం చూస్తూ ఊరుకోదు. తగిన విధంగా స్పందిస్తాం. ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడటమే కాదు.. గతంలో కనిష్క్ ఎయిర్ లైన్స్ విమాన దుర్ఘటన విషయంలో కాకినాడకు చెందిన పద్మశ్రీ అవార్డు పొందిన శ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ గారి కుటుంబంతోపాటు పలువురు మృతి చెందారు. 

ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్రవాద సమస్య పరిష్కారానికి జాలి, దయ అనేవి లేకుండా పని చేయాలి. అంతర్గత భద్రత కాపాడే విషయంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు దన్నుగా ప్రతి ఒక్క భారతీయుడు నిలబడాలి.

ప్రజల్లో చైతన్యం రావాలి..

ఉగ్రవాద కార్యకలాపాలు, వారి కదలికలపై ప్రజల్లోనే చైతన్యం రావాలి. దేశానికి, సమాజానికి చేటు చేసే ఉగ్రవాదుల జాడలు, వారి కదిలికలు గుర్తించి చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. మనలోనే ఉంటూ, మన మధ్యనే మారణహోమం సృష్టించే ఉగ్రమూకలపై పోలీసులకు, భద్రత దళాలకు తగిన విధంగా సమాచారం అందించాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే వారికి గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. వచ్చే నెలలో రాష్ట్రంలో ప్రధాని  నరేంద్ర మోదీ  పర్యటనకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎస్పీజీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఆరు వారాల ముందు నుంచి తగిన భద్రతా చర్యలు ఉంటాయి.

 ప్రతి స్కూళ్లో సూర్య నమస్కారాలు ఉండాలి

యోగా అనేది మన జీవితంలో భాగం కావాలి. మన తరతరాల ఆస్తి అవ్వాలి. భావి తరాలకు యోగా, సూర్య నమస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పాలి. పాఠశాలల్లో ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేయించడం మంచి పద్ధతి. దీనికి ప్రతి స్కూళ్లో వ్యాయామ ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. యోగా వల్ల పిల్లలకు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు ఆరోగ్య సమస్యలకు అది ఎంతలా ఉపయోగం అనేది తెలియచెప్పాలి. 

 ఇంటింటి రేషన్ ఎక్కడా జరగలేదు

గత ప్రభుత్వ హయాంలో ఇంటింటి రేషన్ అని చెప్పి రూ. 1600 కోట్ల స్కాం చేశారు. పోనీ క్షేత్ర స్థాయిలో వాహనాలు ఇంటింటికి వెళ్లాయా అంటే అదీ లేదు. వీధిలోకి వచ్చిన వాహనం దగ్గరకు అంతా వెళ్లి రేషన్ తీసుకోవల్సి వచ్చేది. 9,260 వాహనాలను అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు అక్రమ రేషన్ బియ్యం తరలింపునకు గ్రీన్ ఛానెల్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ వాహనాలను మానవతా దృక్పథంలో వారికే ఇచ్చేసి భృతి చూపించాలని భావిస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎండీయూ వాహనాలను రద్దు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై తగిన విధంగా ముందుకు వెళ్తాం. 

గత ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంపై అధీకృత దర్యాప్తు సంస్థ విచారణ సాగిస్తోంది. అధికారులు సరైన రీతిలో విచారణ సాగిస్తున్నారు" అన్నారు.

Comments

-Advertisement-