అధికార లాంఛనాలతో పోలీసు డాగ్ 'మిక్కి'కు అంత్యక్రియలు.
అధికార లాంఛనాలతో పోలీసు డాగ్ 'మిక్కి'కు అంత్యక్రియలు.
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్ నందు సుమారు 11 సంవత్సరాల పాటు స్నీపర్ డాగ్ గా విశేష సేవలంధించి, ఈ రోజు ది.14.05.2025వ తేదీన వయసురీత్యా పోలీసు డాగ్ 'మిక్కీ (14 సం.)' తుదిశ్వాస విడిచింది. నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు మిక్కి మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆదేశాల మేరకు మరణించిన మిక్కి భౌతికకాయానికి అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్., సి.ఎస్.డబ్ల్యూ డి.సి.పి. ఎస్.వి.డి.ప్రసాద్ గార్లు, ఎ.సి.పి. కృష్ణం రాజు , ప్రేమ్ కుమార్ , ఆర్.ఐ.లు, ఆర్.ఎస్.ఐ.లు ఇతర అధికారులు పోలీసు డాగ్ మిక్కి పార్ధీవ దేహానికి పూల మాలల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
పోలీస్ జాగిలం " మిక్కి ” ఇది లాబ్రాడార్ రీట్రీవర్ జాతికి చెందినది. ఇది ది.06.05.2012వ తేదీన జన్మించింది. దీన్ని హైదరాబాదులోని ఐ.ఐ.టి.ఎ, ఐ.ఎస్.డబ్ల్యూ. శిక్షణ సెంటర్ నందు డాగ్ హ్యాండ్లర్ ఏ.ఆర్.హెచ్.సి-412, పి.నాగరాజు ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందింది. నగరానికి ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత కొరకు బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ చేపట్టే ముందస్తు భద్రత చర్యల్లో చురుకుగా పాల్గొని, ఎక్సప్లోజివ్స్ ను గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించడం, అదే విధంగా పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ముఖ్య అతిధులకు పుష్ప గుచ్ఛాలను అందించడంలో నేర్పుగా వ్యవహరించడం లలో మిక్కి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 11 సంవత్సరాల పాటు మిక్కి తనదైన నైపుణ్యన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించుట ద్వారా వివిధ బందోబస్తులలో మరియు ప్రముఖుల పర్యటనలలో ఎటువంటి సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా జరిగేందుకు ముఖ్య పాత్ర వహించిన మిక్కికి ది.17.05.2024 తేదీన పధవీ విరమణ చేయడం జరిగింది. అనంతరం ఈ రోజు ది.14.05.2025వ తేదీన వయసు రీత్యా తుదిశ్వాస విడిచింది.
