రహదారి భద్రత - మనందరి బాధ్యత
రహదారి భద్రత - మనందరి బాధ్యత
హెల్మెట్ ఆవశ్యకతపై మరియు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంపై నగరంలో విస్తృతంగా వాహన తనిఖీలను నిర్వహిస్తున్న ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు.
సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై మరియు వాహనాధారులలో హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ మరియు లా & ఆర్డర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలో వాహనదారులపి విస్తృతంగా వాహన తనిఖీలను నిర్వహించడం జరిగింది.
ఈ నేపధ్యంలో ఈ రోజు సాయంత్రం 05.00 గంటల నుండి 07.00 గంటల వరకు నగరం లోని ముఖ్య ప్రదేశాలు అయిన భవానిపురం సీతారా సెంటర్, గొల్లపూడి, ఒన్ టౌన్ అమ్మ హోటల్ సెంటర్, టూ టౌన్ పాముల కాలువా సెంటర్, నున్న భవానిభార్, కండ్రిక సమీపంలలో, జగ్గయ్య పేట ఎన్.టి.ఆర్.సర్కిల్, కంచికచెర్ల, మైలవరం, మొదలగు ఏరియాలలో పోలీసు అధికారులు వాహనాలు తనిఖీలు నిర్వహించి, వాహన ధారులకు హెల్మెట్ అవశ్యకతపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ తనిఖీలలో హెల్మెట్ ధరించని వాహనదారులను హెల్మెట్ వలన ఉపయోగాలను గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న జరిమానాలను వెంటనే చెల్లించాలని, మీ ఫోన్ లోనే జరిమానాలు చెల్లించవచ్చు అని తెలియజేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేసారు.
కావున మోటార్ సైకిల్ వాహనాధారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులందరు రహదారి భద్రత నియమాలు పాటించి పోలీస్ వారికి సహకరిస్తారని ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు కోరారు.
