భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో 20 చెరువులు 100 శాతం నిండాయి
మరో 20 చెరువులు 75 శాతం నిండాయి
పరిసర ప్రాంత ప్రజలు, ఆయకట్టు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావొద్దు
అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 8500292992 కాల్ చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, మే 19 :
- భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో 20 చెరువులు 100 శాతం నిండాయన్నారు. మరో 20 చెరువులు 75 శాతం నిండాయన్నారు. కనుక పరిసర ప్రాంత ప్రజలు మరియు ఆయకట్టు పరివాహక గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రాకూడదని సూచించారు.
- అత్యవసర పరిస్థితులలో సహాయం కొరకు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 8500292992 కాల్ చేసి వివరాలు తెలపాలన్నారు.
100 శాతం నిండిన చెరువుల వివరాలు
- బెలుగుప్ప మండలం బీజకుండరి ఎంఐ ట్యాంక్ (సీర్పి)
- గార్లదిన్నె మండలంలోని పెనకచర్ల, ఎర్రగుంట్ల, కోటంక.
- గుత్తి మండలంలోని గుత్తి ఎంఐ ట్యాంక్ (ఆర్ఏటి), మామడురు ట్యాంక్, ములవాని చెరువు, బ్రాహ్మణపల్లి ఊర చెరువు.
- గుంతకల్లు మండలంలోని నాగసముద్రం ఎంఐ ట్యాంక్, రాగులపాడు చెరువు, ఊర చెరువు.
- పామిడి మండలంలోని అనుంపల్లి ఎంఐ బిగ్ ట్యాంక్, బూదవాని చెరువు, పాళ్యం ఎంఐ ట్యాంక్, సూరకాయలపేట చెరువు.
- పెద్దవడుగూరు మండలంలోని చిత్రచేడు ఎంఐ ట్యాంక్.
- రాప్తాడు మండలంలోని గొందిరెడ్డిపల్లి ట్యాంక్.
- వజ్రకరూరు మండలంలోని పల్లెచెరువు, జిల్లేదార్ చెరువు, చెట్టికుంట చెరువులు పూర్తిగా 100 శాతం నిండాయి.
75 శాతం నిండిన చెరువుల వివరాలు
- అనంతపురం రూరల్ పరిధిలోని కామారుపల్లి ట్యాంక్, కురుగుంట ట్యాంక్, కొడిమి, పామురాయి ట్యాంక్.
- ఆత్మకూరు మండలంలోని మదిగుబ్బ ట్యాంక్, తోపదుర్తి బిగ్ ట్యాంక్.
- బుక్కరాయసముద్రం మండలంలోని అనంతసాగర్ (అనంతపురం) ట్యాంక్, చెన్నంపల్లి చిన్నకృష్ణమ్మ ట్యాంక్, కెకె.అగ్రహారం ట్యాంక్.
- గుంతకల్లు మండలంలోని పికె.చెరువు, వైటి.చెరువు ఎంఐ ట్యాంక్.
- పామిడి మండలంలోని రామగిరి ట్యాంక్.
- రాప్తాడు మండలంలోని బుక్కచెర్ల ట్యాంక్, ఊరుముందర చెరువు (బండమీదపల్లి ట్యాంక్).
- ఉరవకొండ మండలంలోని బూదిగవి ట్యాంక్.
- విడపనకల్లు మండలంలోని డొనేకల్ ట్యాంక్, హావళిగి ఆనికట్ స్కీం.
- వజ్రకరూరు మండలంలోని భూమిరెడ్డికుంట, దాసప్పకుంట, జె.రామాపురం ఎంఐ ట్యాంక్ 75 శాతం నిండాయన్నారు. ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.