రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నవంబర్ లో నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రధానం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

నవంబర్ లో నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రధానం

కళా, సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవం తెస్తాం

త్వరలో ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా.. తద్వారా కళా నాటక రంగాలకు చేయూత

రాబోయే రోజుల్లో మరిన్ని టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ ల నిర్వహణ

భవిష్యత్తులో అమరావతిలో సినిమా రంగం ఎదిగేందుకు కృషి మంత్రి కందుల దుర్గేష్

Nandi awards minister kandhula Durgesh

ఏలూరులో దివ్య  ఆలపాటి రామచంద్ర రావు శతజయంతి ఉత్సవాల్లో, జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

ఏలూరు: ఈ ఏడాది నవంబర్లో నంది నాటకోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి కందల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏలూరులోని  మోతే గంగరాజు ప్రాంగణం లోని వై ఎం హెచ్ ఏ హాల్ లో అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్ర రావు శతజయంతి ఉత్సవాల్లో, జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా, సాంస్కృతిక రంగాల వైభవాన్ని, కూటమి ప్రభుత్వం కళలకు, సాంస్కృతిక రంగానికి అందిస్తున్న చేయూత, పర్యాటక, సినీ రంగ అభివృద్ధి విశేషాలను, పద్య నాటకం గొప్పతనాన్ని, గత ప్రభుత్వం పర్యాటక, సినీ, కళా, సాంస్కృతిక రంగాలకు చేసిన అన్యాయాన్ని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. 

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో నాటక, కళా రంగాలకు ఇవ్వని పురస్కారాలను తాము అధికారంలోకి రాగానే జీవం పోసి అందిస్తున్నామని తెలిపారు.. ఇప్పటికే ఉగాది, కందుకూరి పురస్కారాలు అందించామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఘనత తెచ్చిన నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. టీవీ, సినిమా రంగానికి ఇచ్చే నంది అవార్డులను పునరుద్ధరించి నంది నాటకోత్సవాలతో పాటు కలిపి నవంబర్లో అందిస్తామని తెలిపారు. 

 ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారుల కోసం ''నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'' ఇవ్వాలని ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి కోరానన్నారు. తద్వారా నాటక, కళా రంగాలకు చేయూత ఇచ్చిన వారవుతారని, ఔత్సాహికులను ప్రోత్సహించినట్లు అవుతుందని తెలిపాను అన్నారు.. కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు.

తమకు ఆర్ధిక సాయం అందించకున్నా పరవాలేదు గౌరవం ఇస్తే చాలు అని కోరుకునే ఏకైక వ్యక్తి కళాకారుడని ఈ సందర్భంగా మం త్రి దుర్గేష్ తెలిపారు.. గత ప్రభుత్వం అందరితో పాటు కలిపి తమకు పెన్షన్లు అందించిందని.. అందరితో పాటు కాకుండా తమకు కళాకారుల పేరుతో పెన్షన్లు పంపిణీ చేస్తే బాగుంటుందని, అది తమకు గౌరవంగా ఉంటుందని కళాకారులు అభిప్రాయపడ్డట్టు మంత్రి దుర్గేష్ తెలిపారు. కళా రంగం ఎదిగేందుకు తన వంతు ప్రోత్సాహం అందించిన ఆలపాటి రామచంద్ర రావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

పీపీపీ విధానంలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిందని, పెట్టుబడులకు అనుకూలమైన నూతన పర్యాటక పాలసీని విడుదల చేశామని తెలిపారు. తద్వారా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. విశాఖ పట్నం, విజయవాడ, న్యూఢిల్లీ సహా పలుచోట్ల ఇన్వెస్టర్స్ సమ్మిట్ లు నిర్వహించామన్నారు. జర్మనీలో రాష్ట్ర పర్యాటక వాణిని వినిపించి పెట్టుబడులను ఆకర్షించామని ఈ సందర్భంగా తెలిపారు. గతంలో సరైన ప్రమోషన్లు లేక పర్యాటక రంగం కుదేలైంది అన్నారు.

దేశంలోనే మొదటిసారిగా ట్రాన్స్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సిటీని ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఇటీవల ఒప్పందం జరిగిందన్నారు. ఏపీకి వచ్చే సందర్శకులు లీనమయ్యేలా థీమ్ పార్క్ లు, గేమింగ్ జోన్ లు, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్ లు ఏర్పాటు అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో అమరావతిలో సినిమా రంగం ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు..

Comments

-Advertisement-