క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలి
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలి
శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
కర్రసాము క్రీడాకారులకు అభినందన
విజయవాడ:
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టి రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో సిలంబమ్(కర్రసాము) క్రీడాకారులు శాప్ ఛైర్మన్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిలంబమ్ క్రీడాకారులు మాట్లాడుతూ ఏలూరు జిల్లా కలిదిండిలో ఏప్రిల్ 30వ తేదీన జరిగిన స్టేట్ లెవల్ సిలంబమ్ ఛాంపియన్‌షిప్-2025 పోటీల్లో వారు సాధించిన విజయాలు, పతకాల గురించి శాప్ ఛైర్మన్ కు వివరించారు. ఎస్వీఆర్కే ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 73 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వారిని శాప్ ఛైర్మన్ అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, తమకు కావాల్సిన క్రీడాసదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర, దేశ గౌరవాన్ని పెంచాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సిలంబమ్ కోచ్ లు శ్రీకాంత్, వర్మ, సిలంబమ్ అసోసియేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.