అంతర్జాతీయ క్రీడల్లో తెలుగు చిన్నారి ప్రతిభకు మంత్రి ఆదరణ
అంతర్జాతీయ క్రీడల్లో తెలుగు చిన్నారి ప్రతిభకు మంత్రి ఆదరణ
3వ ఆసియన్ ఏరోబిక్స్ & హిప్‌హాప్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే క్రీడాకారిణికి మంత్రి ఆర్థిక సహాయం.
₹50,000/- సొంత నిధుల అందించి సహాయం చేసిన రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
విజయవాడ, మే 22:
వీరం మచినేని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ (వీవీఎస్), విజయవాడలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థిని వి. మౌనిక 2025 మే 29 నుండి జూన్ 1 వరకు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న 3వ ఆసియన్ ఏరోబిక్స్ & హిప్‌హాప్ ఛాంపియన్‌షిప్ లో భారతదేశం తరఫున పాల్గొనబోతున్నారు.
ఈ అంతర్జాతీయ క్రీడాపోటీ కోసం అవసరమైన మొత్తం వ్యయాన్ని తల్లిదండ్రులు భరించలేని పరిస్థితిని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్ షిబ్లీ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా , తన సొంత నిధుల నుండి రూ.50,000/-ను మౌనికకు సచివాలయంలోని మంత్రి చాంబర్లో ఓఎస్డీ లు K. విశ్వనాథం, A. కోటేశ్వరరావు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లీ చేతుల మీదుగా ఆర్థిక సహాయంగా అందజేశారు.
మంత్రి గారు చేసిన ఈ సహాయం పట్ల మౌనిక తల్లిదండ్రులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
"దుబాయ్‌లో జరిగే ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచి భారతదేశానికి గర్వకారణంగా నిలవాలనే సంకల్పంతో ఉన్నానని మౌనిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి, సియం చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, శుబ్లీ గారికి ధన్యవాదాలు తెలిపారు.