దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు
దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు
• డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
• మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు..
• జూన్ 30 నుంచి తరగతులు ప్రారంభం..
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల అయింది. దోస్త్ నోటిఫికేషన్‌ను విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. 3 విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ, దోస్త్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. మొత్తం మూడు ఫేజ్‌లలో డిగ్రీ సీట్లను భర్తీచేయనున్నారు. మొదటి ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల3వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. మే 3నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించి, మే 10 నుంచి 21వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నట్టు వివరించారు. మే 29న తొలివిడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. మూడు ఫేజ్‌లలో సీట్లు సాాధించిన విద్యార్థులు జూన్ 24 నుంచి జూన్ 28 లోపు వారికి సీట్ వచ్చిన కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూన్ 30 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయి.
మొదటి ఫేజ్ : -
మే 21 వరకు దరఖాస్తుల స్వీకరణ
మే 10 నుంచి మే 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
మే 29 న మెుదటి ఫేజ్ సీట్ల కేటాయింపు
రెండో ఫేజ్ : -
మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ
మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
జూన్ 13 న రెండో ఫేజ్ సీట్ల కేటాయింపు
మూడో ఫేజ్ : -
జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం
జూన్ 23 న మూడో ఫేజ్ సీట్ల కేటాయింపు