గ్రంథాలయాలు భవిష్యత్తు తరాలకు విజ్ఞాన కేంద్రాలుగా మారాలి
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Mounikadesk
గ్రంథాలయాలు భవిష్యత్తు తరాలకు విజ్ఞాన కేంద్రాలుగా మారాలి
జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
- గ్రంథాలయాలు భవిష్యత్తు తరాలకు విజ్ఞాన కేంద్రాలుగా మారాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు పర్సన్ ఇంచార్జ్ జిల్లా గ్రంథాలయ సంస్థ వారు జిల్లాలోని 79 గ్రంథాలయాలకు సంబంధించిన గ్రంథాలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
- ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయ అధికారులు అందరూ నిర్ణీత సమయంలో గ్రంథాలయాలను తెరిచి ఉంచాలని, గ్రంథాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రంథాలయ పన్నుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సంబంధించిన పంచాయతీ మరియు మున్సిపాలిటీ వారి నుంచి నిర్ణీత సమయంలో వసూలు చేయాలని తెలిపారు. అలాగే గ్రంథాలయాలను ఆదర్శ గ్రంథాలయాలుగా మార్చుటకు ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రంథాలయ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరముల గురించి పాఠకులకు అవగాహన కల్పించి, చదువుతున్న పిల్లలకు చక్కటి నైపుణ్యాలను కల్పించాలని తెలియజేశారు. పోటీ పరీక్షలకు తయారవుతున్న అభ్యర్థులకు వారి యొక్క సమయానుగుణంగా గ్రంథాలయాలను తెరచి ఉంచి వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించవలసిందిగా తెలిపారు. ఆసక్తి ఉన్న పదవీ విరమణ ఉద్యోగుల నుంచి స్వచ్ఛందంగా సేవ దృక్పథం కలిగి ఉన్న వారిని రిసోర్స్ పర్సన్ లుగా ఎంపిక చేసి గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులకు డ్రాయింగ్, నృత్యము, పెయింటింగ్, సంగీత వాయిద్యాల శిక్షణ మరియు బోధన తరగతులను అందించాలన్నారు. అలాగే గ్రంథాలయాల్లో కనీస వసతులైన టాయిలెట్స్ లైటింగ్ ఫ్యాన్స్ మరియు త్రాగు నీటి వసతులు ఉండునట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అలాగే గ్రంథాలయ అధికారులకు ఏమైనా సమస్యలు ఉన్నచో వాటిని తమ దృష్టికి తీసుకువచ్చినచో వెంటనే పరిష్కారం చేయుటకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రంథాలయాలు భావితరాలకు విజ్ఞాన కేంద్రాలుగా మారాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ జిల్లా గ్రంథాలయ శాఖ మరియు ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయ అధికారులందరూ పాల్గొన్నారు.
Comments