రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పాకిస్తాన్ ముక్కలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

పాకిస్తాన్ ముక్కలు


  • బలూచిస్తానే కాదు..
  • సింధూవేశ్ కూడా !

పాకిస్తాన్ లో మరో ప్రాంతంలో వేర్పాటు వాదం ప్రారంభమైంది. సింధ్ ప్రాంత ప్రజలంతా తమను సింధూవేశ్ గా గుర్తించాలని ప్రత్యేక దేశంగా చేయాలన్న ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. సింధ్ రాష్ట్రంలో హోంమంత్రి ఇంటికి ప్రజలు నిప్పు పెట్టారు. ఆ రాష్ట్రంలో ఓ స్కూల్ బస్సుపై డ్రోన్ దాడి జరిగింది. పిల్లలు చనిపోయారు. దీంతో ప్రజల్లో అలజడి రేగింది. పనికి మాలిన ప్రభుత్వం అని.. విరుచుకుపడుతూ ప్రజలు హోంమంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ గొడవలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

నీటి కొరతతో పాక్ ప్రజల్లో అసహనం

 భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో నీటి కొరత పెరిగిపోయి.. పాకిస్తాన్ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. సింధ్ ప్రాంతంలో అంతర్గత సంక్షోభం పెరిగిపోయింది. నీటి కొరత కారణంగా సింధ్‌లోని ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ కోపానికి తోడు పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద దాడులు కూడా సమస్యగా మారాయి. నిరసనకారులు పాకిస్తాన్ పోలీసులపై కాల్పులు కూడా జరిపారు.

సింధువేశ్ దేశం కోసం ఉద్యమం!

సింధ్ ప్రాంతంలో “సింధుదేశ్” ఉద్యమం ఊపందుకుంటోంది. సింధ్‌ను పాకిస్తాన్ నుండి వేరు చేసి స్వతంత్ర దేశంగా ప్రకటించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. నీటి కొరత, ఆర్థిక అసమానతలు, మరియు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలు ఈ ఉద్యమానికి ఊతం ఇస్తున్నాయి. ఇప్పటికే బలూచిస్తాన్ ప్రాంతం కూడా ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. అక్కడికి పాకిస్తాన్ సైన్యం చేరుకోలేకపోతోంది. ఇప్పుడు సింధ్‌లోని అసంతృప్తి పాకిస్తాన్‌లో అంతర్యుద్ధ లాంటి పరిస్థితులకు దారితీస్తోంది.

కంట్రోల్ చేయలేకపోతున్న పాక్ ప్రభుత్వం

పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అల్లర్లను అదుపు చేయడానికి పోలీసు బలగాలను మోహరిస్తోంది, కానీ నిరసనకారుల ఆగ్రహం తగ్గడం లేదు. సింధ్‌లోని ప్రజలు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ వివక్ష అన్ని ప్రాంతాలపై ఉండటంతో నిరసనలు పెరుగుతున్నాయి. అంతర్యుద్ధం దిశగా సాగుతున్నాయి. కొన్ని రోజులకు పాకిస్తాన్ ముక్కులుగా మారి.. ఎవరి దగ్గర ఆయుధాలు ఉంటే వారే తమ ప్రాంతానికి పాలకులమని ప్రకటించుకునే పరిస్థితివచ్చినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Comments

-Advertisement-