Inter Supplementary : నేటి నుంచే తెలంగాణ లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..!!
Inter Supplementary : నేటి నుంచే తెలంగాణ లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..!!
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (Inter Supplementary Exams) నేటి (మే 22) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ప్రతి రోజు ఉదయం 9:00 గంటల నుంచి మద్యాహ్నం 12:00 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.
నాలుగు లక్షలకు పైగా విద్యార్థుల హాజరు
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి గందరగోళం లేకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు ఎగ్జామ్ హాల్‌కి కనీసం అరగంట ముందుగా చేరాలని సూచించారు. అలాగే హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
లిఖితపూర్వక పరీక్షల అనంతరం, జూన్ 3నుంచి 6వ తేదీ వరకు ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. పాస్ అయ్యే అవకాశం కోల్పోయిన విద్యార్థులకు ఇది కీలక అవకాశం కావడంతో ప్రతి ఒక్కరూ పూర్తి కసరత్తుతో సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.