రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నిందితులకు పక్కాగా శిక్షలు పడాలంటే నేర స్థలంలో శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించడమే ముఖ్యం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

నిందితులకు పక్కాగా శిక్షలు పడాలంటే నేర స్థలంలో శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించడమే ముఖ్యం


జిల్లా ఎస్పీ  పి.జగదీష్ IPS 

 జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో " ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ " పై ఒకరోజు వర్క్ షాప్ 

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ  హరీష్ కుమార్ గుప్తా IPS  ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీసు అధికారుల అవగాహనకు ఫోరెన్సిక్ నిపుణులచే ఒక్క రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు

నేరస్తుల శాస్త్రీయ గుర్తింపు కోసం నేర స్థలంలో ఆధారాల సేకరణ, వాటి ప్యాకేజింగ్, భద్రతా ప్రమాణాలు, సిరాలజీ, డీఎన్ఏ, టాక్సికాలజీ, సైబర్ ఫోరెన్సిక్స్ వంటి విభాగాల్లో సమగ్ర అవగాహన కల్పించారు.

జిల్లా ఎస్పీ  పి.జగదీష్ IPS  ప్రసంగం 

టెక్నాలజీ ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి నేరస్తులు కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారన్నారు. అటువంటి వారిని సమర్థవంతంగా పట్టుకుని చట్టం ద్వారా శిక్షలు వేయించాలంటే పోలీసు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దర్యాప్తు పద్ధతులపై లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫోరెన్సిక్ శిక్షణ వల్ల ఆధారాల విలువలపై స్పష్టత కలిగి, నేర విచారణను బలపర్చే శక్తి లభిస్తుంది అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జిల్లాలో నేర విచారణ ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా నిందితులకు శిక్షలు... బాధితులకు న్యాయం జరగడం వల్ల ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించే దిశగా మైలురాయిగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ గారు అభిప్రాయపడ్డారు.

ఫోరెన్సిక్ నిపుణులచే అవగాహన-శిక్షణ :

నేర స్థలం నుండి ఆధారాలను సేకరించడం, వాటిని ప్యాకింగు చేయడం, సిరాలజీ, ఫోరెన్సిక్ ఫిజిక్స్, డి.ఎన్.ఎ., టాక్సికాలజీ, రసాయన, నార్కోటిక్, సైబర్, ఆడియో, వీడియో పరీక్షలకు పంపడంలో మెలకువలను ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు అధికారులకు వివరించారు. నేర స్థలం నుండి రక్త నమూనాలను, సెమన్, వెంట్రుకలు, ఉమ్ము, పాదముద్రలు, వేలిముద్రలు సేకరించడం... మత్తు పదార్థాలు, మానవ అవయవాలు, విష పదార్థాలు, సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆడియోలు, వీడియోలను, మెమరీ కార్డులు, హార్డ్ డిస్క్ లను భద్రపర్చి, ఫోరెన్సిక్ ల్యాబ్లలకు పంపడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫోరెన్సిక్ నిపుణులు తెలియజేశారు. 

కీలక కేసుల ఛేదింపులో పాటించాల్సిన పద్ధతులపై సమగ్రచర్చ :

హత్యలు, అత్యాచారాలు, అనుమానాస్పద మరణాలు, రోడ్డు ప్రమాదాలు, విష పదార్దాలు, ప్రేలుడు పదార్ధాలు వంటి ముఖ్యమైన కేసుల దర్యాప్తులో భౌతిక ఆధారాల సేకరణ, వాటిని ప్రాసెస్ చేసే విధానం మరియు దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన అంశాలపై ఈ వర్క్‌షాప్‌లో ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో సమగ్రంగా చర్చించారు. నేర స్థలంలో లభించిన వివిధ రకాల భౌతిక సాక్ష్యాధారాలను ఎలా ప్యాకింగ్ చేయాలి, ఏ వస్తువులను ఏ విధంగా భద్రపరచాలి అనే విషయాలపై అధికారులు నిపుణుల నుండి విలువైన సలహాలు మరియు సూచనలు పొందారు.

దర్యాప్తు సమయంలో ఎదురయ్యే సందేహాలపై నివృత్తి 

ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న అధికారులు, దర్యాప్తు సమయంలో వారికి ఎదురయ్యే సందేహాలను నిపుణులతో నివృత్తి చేసుకున్నారు. తద్వారా కేసుల విచారణను మరింత బలమైన ఆధారాలతో మరియు న్యాయమైన మార్గంలో ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన అవగాహనను పొందారు. అనంతపురం RFSL అసిస్టెంట్ డైరెక్టర్ రాజా రంగనాథరెడ్డి, ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఆఫీసర్ సుధారాణి, సైంటిఫిక్ అసిస్టెంట్స్ మురళీ, వెంకటేశ్వరరావులు విలువైన సలహాలు/ సూచనలు అందించారు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరావు, రవికుమార్, వెంకటేశులు, సూర్య నారాయణరెడ్డి, జిల్లాలోని సి.ఐ లు, ఎస్సైలు, సైబర్ విభాగం, ఐటి కోర్ టీం, ఫింగర్ ప్రింట్స్ అధికారులు & సిబ్బంది పాల్గోన్నారు.

Comments

-Advertisement-