రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఇంటింటి చెత్త సేకరణ తప్పనిసరిగా చేపట్టాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

ఇంటింటి చెత్త సేకరణ తప్పనిసరిగా చేపట్టాలి


  • నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం
  • ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతగా పనిచేయాలి
  • వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్జి

జీల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పథకంపై డ్వామా పిడి, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఏపీఎం, ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఛాయాపురం గ్రామంలో ఇంటింటి చెత్త సేకరణ చేయడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజలు తెలియజేయడం జరిగిందని, చెత్త సేకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారని, రాష్ట్రంలో పరిశుభ్రత, స్వచ్ఛతపై విప్లవం జరుగుతోందన్నారు. పంచాయతీ సెక్రటరీలు, ఈఓఆర్డీలు ఇంటింటి చెత్త సేకరణ ప్రతి గ్రామంలోనూ జరిగేలా బాధ్యత వహించాలన్నారు. గ్రామస్థాయి అధికారులను కంట్రోల్ లో పెట్టుకోవాలని, వారు ఖచ్చితంగా పని చేసేలా చూడాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేయరాదని, ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయకపోతే కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల్లో ఎప్పటికప్పుడు పురోగతి చూపించాలని, కేటాయించిన లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయాలన్నారు. సిసి రోడ్లు మే 15 నాటికి పూర్తి చేయాలని, బీటీ రోడ్లను ఈనెలాఖరుకు పూర్తిగా చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ ఏఈలు బీటీ రోడ్లకు సంబంధించిన పెండింగ్ గ్రౌండింగ్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని, నిర్లక్ష్యం వహించరాదన్నారు. సిసి డ్రైన్స్ కు సంబంధించి పురోగతి తక్కువగా ఉందని, వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. పల్లె వనాలు, నాడార్ పిట్స్, పెరీనియం ఫాడర్, 90 డేస్ హౌసింగ్, హైడెన్ సిటీ ప్లాంటేషన్, డైలీ లేబర్ టర్నవుట్, వేజ్ సీకర్స్, బడ్జెట్ టర్నవుట్, ఫారంపాండ్స్, పల్లె పుష్కరిణి- అమృత్ సరోవర్, మినీ అమృత్ సరోవర్, రూఫ్ టాఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, జల్ సంచాయ్ జన్ భాగీదరి, తదితర అంశాలకు సంబంధించి పెండింగ్ ను వెంటనే పూర్తిచేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఆరు ఫారంపాండ్స్ లను గ్రౌండ్ చేసి ఈనెలాఖరుకి పూర్తి చేయాలని ఆదేశించారు. డైలీ లేబర్ టర్నవుట్, వేజ్ సీకర్స్, బడ్జెట్ టర్నవుట్ కు సంబంధించి రోజువారీగా నివేదిక అందించాలన్నారు. వేసవికాలంలో పనులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని, తక్కువగా చేయరాదని, ఉపాధి పనులను అధికంగా చేపట్టాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పీఆర్ ఈఈ ప్రభాకర్ రెడ్డి, హౌసింగ్ పీడీ శైలజ, డ్వామా పిడి సలీమ్ భాష, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-