రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రతి ఒక్కరినీ యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాలి

Yoga exercises Yoga poses Yoga benefits Types of yoga Yoga for beginners Yoga for Health Benefits of yoga About yoga
Mounikadesk

ప్రతి ఒక్కరినీ యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాలి


- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

తాడిపత్రి, మే,26:

ప్రతి ఒక్కరినీ యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించా లని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తాడిపత్రిలోని మున్సిపల్ కార్యాలయపు సమావేశ మందిరంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం ప్రారంభించడానికి ముందు జిల్లా కలెక్టర్ యోగాంధ్ర-2025 కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,నేడు తాడిపత్రి లోని బుగ్గ రామలింగేశ్వర ఆలయ సమీపంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమం చాలా చక్కగా జరిగిందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో చారిత్రాత్మక ప్రదేశాలైన గుత్తి కోట, తాడిపత్రి లోని చింతల  వెంకట రమణ స్వామి ఆలయం వద్ద, అనంతపురంలోని శిల్పారామంలో మరింత పకడ్బందీగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈనెల 27వ తేదీ నుండి జూన్ 21 వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను అధికారులకు వాట్స్అప్ గ్రూప్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖలు నిర్వహించే కార్యక్రమాల ప్రదేశాలను ముందస్తుగా గుర్తించాలన్నారు. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో విరివిగా యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్లు చేయించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి, జి ఎస్ డబ్ల్యూ ఎస్ ఇంచార్జ్ లు ఇంటింటి సర్వే చేపట్టేటప్పుడు విధిగా ప్రతి ఒక్కరిని యాప్ నందు రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. జిల్లా స్థాయిలో యోగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నేటి నుంచి గ్రామస్థాయిలో యోగా పోటీలు ప్రారంభించాలన్నారు. రోజువారి కార్యక్రమాలను సంబంధిత వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలన్నారు .యోగా కార్యక్రమాల నిర్వహణలో పిఈటిలను కూడా భాగస్తులు చేయాలని సర్వ శిక్ష అభియాన్ ఏపిసి ని ఆదేశించారు.యోగాంధ్ర రిజిస్ట్రేషన్ ను https:// yogandhra.ap.gov.in/ #/home/launchone లో చేసుకోవాలన్నారు. అలాగే యోగాంధ్ర క్యూఆర్ కోడ్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. జి ఎస్ డబ్ల్యూ ఎస్ యాప్ నందు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పెద్దఎత్తున యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్నివర్గాల ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మాలోల, అనంతపురం ఆర్డిఓ కేశవ నాయుడు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ లు రామ్మోహన్, మల్లికార్జున, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ఎంపీడీవో ఫజిల్, తహశిల్దార్ రజాక్ వలి ,మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-