రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

యోగాను క్రమం తప్పకుండా సాధనచేస్తే ఆరోగ్యానికి బాట..

Yoga exercises Yoga poses Yoga benefits Types of yoga Yoga for beginners Yoga for Health Benefits of yoga About yoga
Mounikadesk

యోగాను క్రమం తప్పకుండా సాధనచేస్తే ఆరోగ్యానికి బాట..


టిటిడిసిలో రెవిన్యూ ఉద్యోగుల యోగాభ్యాసం..

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

ఏలూరు,మే,26: యోగాను క్రమం తప్పకుండా సాధనచేస్తే శారీరక, మానసిక, భావోధ్వేగ శ్రేయస్సును సాధించడానికి దోహద

పడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.

స్ధానిక టిటిడిసిలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖల వారీ ఉద్యోగుల యోగాభ్యాస కార్యక్రమం కింద సోమవారం రెవిన్యూ ఉద్యోగుల యోగాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ యోగాను క్రమం తప్పకుండా సాధనచేయడం వల్ల హృదయ సంబంధ ఫిట్ నెస్ పెరగడం, రక్తపోటు సాధారణీకరణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయన్నారు. ఉద్యోగులు యోగాను సాధనచేస్తూ వత్తిడిని నియంత్రించుకోవచ్చన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు యోగాపై అవగాహన కలిగించేందుకు జూన్ 20 వ తేదీవరకు యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు రెవిన్యూ డిపార్ట్ మెంట్, ఈనెల 28వ తేదీన డిఆర్డిఏ, 29న ఎపిఇపిడిసిఎల్, 30వ తేదీన డ్వామా, 31న ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్, జూన్, 2వ తేదీన ఎక్సైజ్, 3వ తేదీన బ్యాంకింగ్, 4న ఉద్యానవన, 5న హౌసింగ్, 6న ఇరిగేషన్, 7న వైద్యఆరోగ్యశాఖ, 9వ తేదీన మెప్మా, 10న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, 11న పంచాయితీరాజ్, 12న జైళ్ళశాఖ, 13న సోషల్ వెల్ఫేర్, 14న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్స్, 16న్ ఐసిడిఎస్, 17న జిల్లా ప్రజా పరిషత్, 18న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, 19న స్కిల్ డెవలప్ మెంట్, జూన్ 20వ తేదీన పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులతో యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహించబడ

తాయన్నారు. అదే విధంగా జిల్లా స్పోర్ట్స్ అధికారి ఆధ్వర్యంలో, మండలస్ధాయిలో తహశీల్దార్లు, యంపిడివోల ఆధ్వర్యంలో, మండల ప్రధాన కేంద్రంలో యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహించ

బడతాయన్నారు.  

కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, ఏలూరు, పెదపాడు తహశీల్దార్లు జి.వి. శేషగిరి, కృష్ణజ్యోతి, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

-Advertisement-