పత్రికా ప్రకటన
పత్రికా ప్రకటన
అమరావతి - (మే,19): గడచిన 10 నెలల్లో పోక్సో , వరకట్న హత్యలు, మహిళల హత్యలు, రేప్ మరియు గ్యాంగ్ రేప్ కేసుల్లో 169 మంది నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించడం జరిగిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళలపై జరిగే వ్యవస్థీకృత నేరాలను అరికట్టడానికి ఐజిపి గరాజకుమారి నేతృతంలో "ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శక్తి యాప్:
మహిళల భద్రతకై అత్యంత అధునాతన ఫీచర్లు కలిగిన "శక్తి యాప్" ఇపుడు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో యూజర్లకు అందుబాటులో ఉండటంతో పాటుగా PlayStore (Android Phone) మరియు IOS (Apple Phone) నుండి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. శక్తి యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 1,52,16,440 మంది శక్తి యాప్ ను తమ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. అత్యవసర సహాయం కోసం (SOS) 11,60,146 మంది కాల్ చేయగా వీటిలో 34,192 తక్షణమే స్పందించవలసిన కాల్స్ గా నమోదు చేసుకొని, 3,193 FIRలు నమోదు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా 242 ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్టులు, సేఫ్ ట్రావెల్ కోసం 160, తప్పిపోయిన పిల్లల కోసం 18 మంది ఈ యాప్ ద్వారా రిపోర్టు చేయడం జరిగిందన్నారు.
శక్తి టీమ్స్:
మహిళల భద్రతకై రాష్ట్రవ్యాప్తంగా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 164 శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శక్తి టీమ్ లు మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మఫ్టీలో నిరంతరం పహారా కాస్తున్నాయన్నారు. మహిళలపై తరచూ నేరాలు జరిగే 900 హాట్ స్పాట్స్ ను గుర్తించడం జరిగిందన్నారు. ఈ హాట్ స్పాట్ ల మీద నిరంతరం నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శక్తి యాప్ యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత, ఉపయోగాల గురించి అవగాహన కల్పిస్తూ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, పబ్లిక్ ప్రదేశాలు మరియు గ్రామీణ ప్రాంతాల మహిళలకు విస్తృతస్థాయిలో 12,119 అవగాహన శిబిరాలు " శక్తి టీమ్స్" నిర్వహించి 17,665 ప్రాంతాలను సందర్శించడం జరిగిందన్నారు. మహిళలపై "ఈవ్ టీజింగ్" కు పాల్పడే 254 మందిని గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరి మీద నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మహిళల పట్ల పురుషుల్లో గౌరవభావం పెంపొంచేందుకు మార్గదర్శకాలు రూపొందించడంతో పాటుగా, స్కూళ్లు, కాలేజీల స్థాయి నుండే జండర్ సెన్సిటివిటీపై అవగాహన కల్పించాలని అన్నారు. మహిళలపై జరిగే హింస, లైంగిక దాడులు, వేధింపులకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా మహిళా సాధికారితకు పెద్దపేట వేయాలన్నారు.
జారీ చేసిన వారు: రాష్ట్ర గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ వారి కార్యాలయం, మంగళగిరి.