రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మసులా ఫెస్ట్ ఏర్పాట్లు పరిశీలన

Mounikadesk

మసులా ఫెస్ట్ ఏర్పాట్లు పరిశీలన

Minister kollu Ravindra masulaa festival

మచిలీపట్నం మే 18: ---

ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించే విధంగా మసులా ఫెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఆదివారం రాత్రి మంత్రివర్యులు మచిలీపట్నం మంగినపూడి బీచ్ ను సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు.

వచ్చే జూన్ నెలలో జరగనున్న మసుల బీచ్ ఉత్సవాల నేపథ్యంలో మంత్రివర్యులు సంబంధిత రేఖా చిత్రపటాన్ని పరిశీలించి, తోరణం నిర్మాణం తదితర ఏర్పాట్లను ముమ్మరం చేయాలని అధికారులకు, ఆర్ట్ డైరెక్టర్కు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కొందరు పర్యాటకులు మంత్రితో ముఖాముఖి మాట్లాడుతూ తాము హైదరాబాదు నుండి వచ్చామని ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు చాలా ఆశ్చర్యం కలిగించాయని, వచ్చే జూన్ మాసం 6 ,7, 8 తేదీల్లో బీచ్ ఉత్సవాలు జరుగుతున్నట్లు తెలిసి ఉత్సాహంగా ఉన్నామన్నారు. అనంతరం మంత్రివర్యులు వారితో మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా మ్యూజికల్ ఫౌంటెన్లను, పిల్లలకు వినోదాన్ని ఇచ్చే జెయింట్ వీల్స్ వంటి ఎంటర్టైన్మెంట్ ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. 

సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

కొన్ని సాహస క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యంగా బీచ్ కబడ్డీ, కయా కింగ్ వంటి జాతీయ క్రీడలను కూడా నిర్వహిస్తున్నామని దేశవ్యాప్తంగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. 

వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

మంగినపూడి బీచ్ హైదరాబాదుకు సమీపంలో ఉందని, అమరావతికి కూడా ముఖద్వారంగా కూడా ఉండడంతో ఈ బీచ్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

వర్షం వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

వివిధ రకాల రుచులతో వంటశాలలు, పుస్తక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పలు రకాల సముద్ర జీవుల ఆకృతులతో బొమ్మలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ పర్యటనలో మంత్రి వెంట మెప్మా పీడీ సాయిబాబు, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక, స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-