రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గవర్నర్ పర్యటన కోసం పక్కాగా ఏర్పాట్ల

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

గవర్నర్ పర్యటన కోసం పక్కాగా ఏర్పాట్ల


కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

అనంతపురం, మే 15 :

- రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం జిల్లా పర్యటన కోసం పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గౌరవ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు జిల్లా పర్యటన సందర్భంగా గురువారం అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో నిర్వహించే స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని, రాష్ట్ర గవర్నర్ పర్యటనకు సంబంధించి ఆర్.అండ్.బి అతిథి గృహంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అతిథి గృహం పరిశుభ్రంగా, చూసేందుకు అందంగా ఉండాలని, మెయింటెనెన్స్ బాగుండాలని, సోఫాలు, ఫర్నిచర్, ఏసిలు మరమ్మతులు చేయాలని, నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

- ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డిఓ కేశవ నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, ఆర్.అండ్.బి డిఈ కాటమయ్య, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, ఏడిఎస్ఓ జగన్ మోహన్ రావు, తహసీల్దార్లు హరికుమార్, బ్రహ్మయ్య, రియాజ్ భాష, ఆర్ఐ సందీప్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-