రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో తిరంగా ర్యాలీ

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో తిరంగా ర్యాలీ


17న తిరంగా ర్యాలీ

హాజరుకానున్న మంత్రి నారా లోకేష్

కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్యే దగ్గుపాటి పిలుపు

అనంతపురం, మే 15 :

- ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 17వ తేదీన నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. 17వ తేదీ ఉదయం 7.30 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ నుండి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు జరగనుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఇది కొనసాగనుందన్నారు. మన దేశ సమైక్యతను అలాగే ఆర్మీకి మన మద్దతు తెలిపే విధంగా ఈ ర్యాలీలో కూటమి పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, మాజీ సైనికులతో పాటు అన్ని వర్గాల వారు హాజరుకావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు.

Comments

-Advertisement-