రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మ్యాన్ పవర్ ఏజెన్సీల తీరు మారాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

 మ్యాన్ పవర్ ఏజెన్సీల తీరు మారాలి


  • అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్ లపై కఠిన చర్యలు తీసుకుంటాం

  • ఇప్పటికే అనేక కంప్లైంట్ లు నా దృష్టికి వచ్చాయ్
  • ఏజెన్సీల తప్పులను ఏమాత్రం సహించను
  • రాష్ట్ర వ్యాప్తంగా ఈ-శ్రమ్ పోర్టల్ లో కార్మికులను నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి
  • IP హోల్డర్స్ మరియు E-shram హోల్డర్స్ సంఖ్యను పెంచాలి
  • ప్రతి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి
  • లేబర్ డిపార్ట్మెంట్ మొబైల్ యాప్ ద్వారా కలిగే సౌకర్యాలను గురించి కార్మికులకు అవగాహన కల్పించాలి
  • అమరావతిలో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వెబ్ సైట్, లేబర్ డిపార్ట్‌మెంట్ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి సుభాష్

అమరావతి, మే 06 (పీపుల్స్ మోటివేషన్):-

మ్యాన్ పవర్ ఏజెన్సీలు అవకతవకలను ఇక ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలో కార్మిక అండ్ ఫ్యాక్టరీల శాఖల అధికారులతో సమావేశమైన మంత్రి మ్యాన్ పవర్ ఏజెన్సీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీల కింద పనిచేస్తున్న సిబ్బందికి కనీసం వేతనాలు కూడా చెల్లించకుండా ఇబ్బందులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కొంతమంది కాంట్రాక్టర్లు మ్యాన్ పవర్ కింద పని చేస్తున్న కార్మికులకు పీఎఫ్ లు కూడా కట్టడం లేదని మంత్రి ఆరోపించారు. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో ప్రమాదాలను నివారించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని దీనిలో భాగంగానే థర్డ్ పార్టీ ఆడిట్లో ఏజెన్సీలకు అనుభవం ఉండి, అర్హతలు ఉండి కంప్యూటర్ ద్వారా కేటాయింపులు చేసి చెప్పే విధంగా ప్రతి ఏజెన్సీ ఉండాలని అధికారులను ఆదేశించారు. ముందుగా లేబర్ డిపార్ట్మెంట్ వెబ్ సైట్ తో పాటు ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ వెబ్ సైట్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 86 లక్షల మంది కార్మికులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారని వారి అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని చెప్పారు. కష్టజీవులుగా చెప్పబడే కార్మికులను గత ప్రభుత్వం తీవ్రంగా మోసం చేయడంతో పని లేక రోడ్డున పడిన పరిస్థితులు కూడా ఉన్నాయని మంత్రి అన్నారు. ముఖ్యంగా గత సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో కార్మికులను అణచివేతకు గురిచేశారని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడిప్పుడే కార్మికుల జీవనస్థితిగతులు మెరుగుపడుతున్నాయని చెప్పారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఉచిత ఇసుకతో ప్రతిరోజు ఉపాధి పొందుతూ రెట్టింపు ఆనందంతో ఉన్నారనిచెప్పారు. ఇక అధికారులు ప్రభుత్వం కార్మికుల కోసం అందజేస్తున్న ప్రతి పథకాలపై కార్మికులకు అవగాహన పెంచాలన్నారు. చంద్రన్న బీమాలో ప్రతి కార్మికుడు నమోదయ్యోలా చూడాలన్నారు. అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం తీసుకువచ్చినా అనేక ఆధునిక విధానాలపై అధికారులు కార్మికులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ-శ్రమ్ పోర్టల్ లో కార్మికులను నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.IP హోల్డర్స్ మరియు E-shram హోల్డర్స్ సంఖ్యను పెంచాలని అధికారులని ఆదేశించారు.ప్రతి జిల్లా కేంద్రంలో ESI డిస్పెన్సరీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.లేబర్ డిపార్ట్‌మెంట్ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు సేవలను మరింత సులభంగా పొందే అవకాశం ఉందని యాప్ పై ప్రజలకు పూర్తిస్తాయి అవగాహన పెంచలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" లక్ష్యంతో: వాట్సాప్ గవర్నెన్స్,AI టూల్స్,గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లను యాప్‌లో అనుసంధానం చేసిన ఈ ఆధునిక విధానం కార్మికులకు చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ & కమిషనర్ ఆఫ్ లేబర్ శేషగిరి బాబు గారు, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గంధం చంద్రుడు గారు, తదితర అధికారులు – JCLలు, DCLలు, ACL లు,ఫ్యాక్టరీస్ అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-