శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ – టిటిడి ఈవో జె. శ్యామల రావు
శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ – టిటిడి ఈవో జె. శ్యామల రావు
తిరుమల ,2025, మే 24: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను టిటిడి ఈవో జె. శ్యామల రావు ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం 14 దేశాలకు చెందిన వివిధ రంగాల ఎన్.ఆర్.ఐ నిపులతో వర్చువల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు స్వచ్ఛందంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పలు రాష్ట్రాలనుంచి శ్రీవారి సేవకులు తిరుమలకు వచ్చి చక్కటి సేవలు అందిస్తున్నారని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలలో నిపుణులైన ఎన్.ఆర్.ఐలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు .టిటిడిలోని వివిధ విభాగాలలో దేశవ్యాప్తంగా శ్రీవారి సేవకులు అందిస్తున్నారని, వారి సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే అమెరికా తదితర దేశాలలో శ్రీనివాస కల్యాణాలు విరివిగా నిర్వహించేందుకు వారు సహకరిస్తున్నారని ,తాజాగా శ్రీవారి సేవలో తీసుకువస్తున్న సంస్కరణల మూలంగా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్ , ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించేందుకు ఎన్.ఆర్.ఐలు ముందుకు వస్తున్నారన్నారు. ఎన్.ఆర్.ఐల నైపుణ్యం ఆధారంగా వారి సేవలను టిటిడిలో అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు .వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని ఈవో తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న NRI లు
టిటిడి శ్రీవారి సేవకుల సేవలను విశ్వవ్యాప్తం చేసేందుకు ముందుకు రావడంపై ఈ అవకాశం తమకు స్వామి. వారు కల్పించిన మహద్భాగ్యం అని హర్షం వ్యక్తం చేశారు.
ఈ వర్చువల్ సమావేశంలో జర్మనీ – సూర్యప్రకాశ్, డా. శివశంకర్, ఐర్లాండ్ – సంతోష్ పల్లె, రమేశ్ గుమ్మడవల్లి, యూకె – లోకనాథం, విజయ్ కుమార్, అరుణ్ ముమ్మలనేని, శివరామ్ రెడ్డి, విజయ్ కుమార్, డా. అనిల్ కుమార్, డా. అనిల్ కుమార్, రీతు, నెదర్లాండ్ – శివరామ్, ప్రాన్స్ – కన్నెవిరనె, పోలెండ్ ఐర్లాండ్ నుండి సంతోష్ – చంద్ర అక్కల, స్వీడన్ రమణకుమార్ రంగా, స్విట్జర్లాండ్ – అమర్ కవి, అమెరికా – రఘువీర్ బండార్, హర్షిత, USA , అమరనాథ్, డెన్మార్క్ ,- రామ్ దాస్, మారిషష్ , శ్రీలంక – నుండి విక్కీ తురాయ్జా , దుబాయ్ నుండి – విక్రమ్ UK నుండి Dr అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టిటిడి నుండి అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి , సీఈ శ్రీ టివి సత్యనారాయణ, ఎప్.ఎ అండ్ సీఏవో ఓ. బాలాజీ, శేషా రెడ్డి, ట్రాన్స్ పోర్ట్ జీఎం, సీఎంవో శ్రీమతి నర్మద తదితరలు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రధానప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.