నైరుతి రుతుపవనాలు నేడు లేదా రేపు తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. ..
నైరుతి రుతుపవనాలు నేడు లేదా రేపు తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. ..
రేపు అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు ఏర్పడనున్నట్లు APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ అల్లూరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు నేడు లేదా రేపు రాష్ట్రాన్ని తాకనున్నాయి. వారంలో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి.
ALERT: నాలుగు రోజులు భారీ వర్షాలు
TG: ద్రోణి నేపథ్యంలో రాష్ట్రంలో నేటి నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్లోనూ ద్రోణి ప్రభావం ఉంటుందని తెలిపింది. కాగా కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో వాతావరణ పరిస్థితులు మారిన విషయం తెలిసిందే.కేరళలో భారీ వర్షాలు, 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
మరో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో భారీ వర్షాలు
నేలకొరిగిన భారీ వృక్షాలు, కొనసాగుతున్న సహాయకచర్యలు
దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు
11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం
నీలగిరి జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిలిపివేత
భారీ వర్షాలతో పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు
ఎక్కడికక్కడ నిలిచిపోయిన పర్యాటకుల వాహనాలు
దేశంలోకి విస్తరించిన నైరుతి.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య, అరేబియా సముద్రంతో పాటు పలు ప్రాంతాలకు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, గోవా అంతటా విస్తరించాయి. అలాగే మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర అంతర్గత కర్ణాటక, మరఠ్వాడ వద్ద అల్పపీడనం ఆదివారం ఐఎస్‌టీ వద్ద కొనసాగుతోందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా తూర్పు వైపునకు కదిలి క్రమంగా బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావం వల్ల తెలంగాణలోని పలు జిల్లాలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఏపీలో కూడా రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా రుతుపవనాలు కేరళకు జూన్ 1వ తేదీన వస్తాయి. కానీ ఈ ఏడాది ముందుగానే వచ్చేశాయి. దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు ఉంది. ఈ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు కూడా మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.