ఖరీఫ్ సంసిద్దతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ మంత్రి సమీక్ష
ఖరీఫ్ సంసిద్దతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ మంత్రి సమీక్ష
అమరావతి, మే 21: ఖరీఫ్ సంసిద్దతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థకం మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర సచివాలయం నుండి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటు వంటి ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసే విషయంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి అధికారులు వరకూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ది రేటును సాదించాలనే లక్ష్యంతో అధికారులు అంతా సమైఖ్యంగా కృషి చేయాలన్ని ఆదేశించారు.
ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, వాల్యూమ్ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని, సాంప్రదాయ పంటల సాగును క్రమంగా తగ్గిస్తూ ఉద్యానమన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి
వ్యవసాయ యాంత్రీకరణ క్రింద 50 శాతం రాయితీ సొమ్మును ముందుగానే అందజేస్తున్నాము, రైతుల వాటా సొమ్ము బ్యాంకు ఋణాలు ద్వారా అందజేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
వ్యవసాయ అనుబంధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తాము, ఏ ఒక్కరూ మద్యవర్తులను ఆశ్రయించ వద్ద, డబ్బులను దుర్వినియోగం చేయవద్ద
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ బి.రాజశేఖర్, సంచాలకులు ఎస్.డిల్లీరావు, ఉద్యానవన& పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు కె.శ్రీనివాసులు, మార్కెటింగ్ శాఖ సంచాలకులు ఎమ్.విజయసునీత, సహకార శాఖ కమిషనర్ అహ్మద్ బాబు, పశుసంవర్థక శాఖ సంచాలకులు దామోదర్ నాయుడు, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి, ఆర్.వై.ఎస్.ఎస్. ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మరియు వ్యవసాయ & సహకార శాఖ సలహాదారులు టి.విజయ కుమార్ తదితరులతో పాటు అన్ని జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.