గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని తొలగించబోం-ఆందోళన చెందవద్దు
గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని తొలగించబోం-ఆందోళన చెందవద్దు
• గ్రామ వార్డు సచివాలయాల సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదు
• గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని సేవలు
• ఎబిసి కేటగిరీలుగా సచివాలయాల విభజన సిబ్బంది సర్దుబాటుకు చర్యలు
• సిబ్బంది సర్దుబాటు చేశాకే సచివాలయాల సిబ్బంది బదిలీలు చేపడతాం
• సచివాయాల పనితీరు నిరంతరం పర్యవేక్షణకు మూడు అంచెల విధానం
రాష్ట్రమంత్రి డా.బాల వీరాంజనేయ స్వామి
అమరావతి,21 మే:రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులెవరినీ తొలగించ బోమని అలాగే వాటి సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ,వార్డు సచివాలయాలు,సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా.వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల రేషన లైజేషన్ కు ఇటీవల జిఓ జారీ చేయడం జరిగిందని సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు.ఇందుకుగాను సచివాలయాలను ఎబిసి అనే మూడు కేటగిరీలుగా విభజించామని ఆప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అనగా 2500 జనభా గల గ్రామ సచివాలయంలో 6గురు సిబ్బంది,2500-3000 జనాభా గల సచివాలయాల్లో 7రు,3వేలకు పైన జనాభా గల సచివాలయాల్లో 8మంది సిబ్బంది ఉండేలా విభజించామని, అంతేగాక క్లస్టర్ విధానాన్ని అనుసరించడం జరుగుతుందని అందుకు అనుణంగా సిబ్బందిని సర్దుబాటు చేశాక వారి బదీలను చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.అందుకే ప్రస్తుత సాధారణ బదిలీల సమయంలో సచివాలయాల సిబ్బంది బదిలీల ప్రక్రియను చేపట్టబోమని అన్నారు.ప్రస్తుతం కొన్ని సచివాలయాల్లో 10 మంది వరకూ సిబ్బంది ఉండగా కొన్నిచోట్ల ముగ్గురు నలుగురు సిబ్బందితో కూడా అవి నడుస్తున్నాయని చెప్పారు.దానివల్ల కొన్ని చోట్ల ఎక్కువ పని ఒత్తిడి కొన్ని చోట్ల తగిన పనిలేని పరిస్థితులు ఉన్నాయని అలాంటి సమస్యలన్నిటినీ పరిష్కరించి సిబ్బంది అందరికీ పూర్తి స్థాయిలో పని కల్పించి తద్వారా ప్రజలకు రియల్ టైంలో మరిన్ని సేవలు సకాలంలో అందే విధంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి వీరాంజనేయ స్వామి పునరుద్ఘాటించారు.
అదే విధంగా త్వరలో మూడు అంచెల విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు మంత్రి వీరాంజనేయస్వామి వెల్లడించారు.అనగా జిల్లా,మండల,అసెంబ్లీ నియోజకర్గ స్థాయిలో ప్లానింగ్ బోర్డులు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో జిల్లా అధికారి,మండల స్థాయిలో ఎంపిడిఓ, నియోజకవర్గ స్థాయిలో ఒక అధికారికి కొంతమంది సిబ్బిందిని ఇచ్చి వారి ద్వారా గ్రామ వార్డు సచివాలయాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి బాలవీరాంజనేయ స్వామి మీడియాకు వివరించారు.
ఈసమావేశంలో గ్రామ,వార్డు సచివాలయాల డైరెక్టర్ శివ ప్రసాద్ పాల్గొన్నారు.