బంగారు వస్తువులను చోరీ చేసిన నేరస్తుల అరెస్ట్ మరియు సొత్తు స్వాధీనం
బంగారు వస్తువులను చోరీ చేసిన నేరస్తుల అరెస్ట్ మరియు సొత్తు స్వాధీనం
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) యం.వెంకటాద్రి
కేసువివరాలు : 1).Cr.No: 67/2025 U/s 331(4), 305(a) BNS of ముదివేడు పోలీస్ స్టేషన్.
2). Cr.No: 69/2025 U/s 331(4), 305(a) BNS of ముదివేడు పోలీస్ స్టేషన్
అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీ .ఇ.జి. అశోక్ కుమార్, ఐపీఎస్, గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం.వెంకటాద్రి గారి పర్యవేక్షణలో మరియు మదనపల్లె సబ్-డివిజినల్ అధికారి శ్రీ. ఎస్.మహేంద్ర గారి ఆద్వర్యములో, మదనపల్లె రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఏ.సత్యనారాయణ గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారము, సీసీఎస్ సీఐ. ఏం.చంద్రశేఖర్, ముదివేడు యస్ఐ పి.దిలీప్ కుమార్ మరియు సిబ్బంది కలిసి 1-5-2025 వ తేదిన ఉదయము 11.00 AM గంటలకు, అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, సీటీయం-అంగళ్లు రోడ్డు, కనసానివారిపల్లె బస్సు స్టాప్ వద్దకు వెళ్ళగా, ఐదు మంది మగ వ్యక్తులు నిలబడుకొని ఉండి, పోలీసుసులను చూసి పారిపోవుటకు ప్రయత్నించగా, సదరు ఇదు మంది వ్యక్తులను, పోలీసు సిబ్బంది సహకారముతో పట్టుకొని వారిని విచారించగా, వారు స్వయంగా చెప్పిన ప్రకారము 25-04-2025వ తేదిన జరిగిన కురబలకోట ఇంటి దొంగతనము అంగీకరించి వారి నేరము ఒప్పుదల ప్రకారం వారి వద్ద నుండి సుమారు 835 గ్రాముల బంగారు వస్తువులను, నేరానికి ఉపయోగించిన రెండు ఆక్సా బ్లేడులు మరియు బాత్ రూమ్ కు ఉండిన కిటికీ ఐరన్ గ్రిల్స్ ను స్వాధీనము చేసుకొని ఐదు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది.
ముద్దాయిల వివరాలు
A1. పాలగిరి అమీర్ సుహేల్, వయస్సు 26 సం.లు, తండ్రి పి.మస్తాన్ వలి, కులము: ముస్లిం, వృత్తి: అకౌంటెంట్, గోల్డెన్ వ్యాలీ ఇంజనీరింగ్ కాలేజే, అంగళ్లు గ్రామము, కురబలకోట మండలం, R/o పగడాలవారిపల్లె రోడ్డు, బ్యాక్ సైడ్ ఆఫ్ ఇండియన్ బ్యాంకు, కురబలకోట టౌన్ & మండలం, అన్నమయ్య జిల్లా.
A2. పాలగిరి సమీర్ అహమ్మద్, వయస్సు 22 సం.లు, తండ్రి పి.మస్తాన్ వలి, కులము: ముస్లిం, వృత్తి: చిల్లరి అంగడి, నీరుగట్టువారిపల్లె, మదనపల్లె టౌన్, R/o, పగడాలవారిపల్లె రోడ్డు, బ్యాక్ సైడ్ ఆఫ్ ఇండియన్ బ్యాంకు, కురబలకోట టౌన్ & మండలం, అన్నమయ్య జిల్లా.
A3. కన్నెమడుగు కిషోర్, వయస్సు 29 సం.లు, తండ్రి.కె.ఆదినారాయణ, కులం: నాయి బ్రాహ్మణ, వృత్తి: కూలి, R/o చాకలవీధి, కురబలకోట, అన్నమయ్య జిల్లా.
ఇతని పైన ప్రశాంత్ నగర్, కురబలకోట నందు బంగారు వస్తువులను దొంగలించిన కేసు , ముదివేడు పోలీస్ స్టేషన్ లో కలదు.
A4. మొగసాల తిరుమలేష్, వయస్సు 27 సం.లు, తండ్రి . యం.సుబ్బరాజు, కులం: యాదవ, వృత్తి: డ్రైవర్& కూలి, స్వగ్రామం చీకులగుట్ట, మదనపల్లె టౌన్ & మండలం, అన్నమయ్య జిల్లా. ఇతను ప్రస్తుతము శ్రీ సత్య సాయి జిల్లా, సోమందపల్లె టౌన్ & మండలం, వినాయక నగర్ లో కాపురము ఉంటున్నాడు.
ఇతని పైన మదనపల్లె SEB PS నందు Excise కేసు కలదు.
A5. టేకులపాలెం అరుణ్ కుమార్, వయస్సు 27 సం.లు, తండ్రి (లేట్) వెంకటరమణ, కులము: రజక, వృత్తి కూలి, R/o డిఆర్. నగర్, కురబలకోట, అన్నమయ్య జిల్లా.
1).ఇతని పైన మదనపల్లె SEB PS నందు excise case కలదు.
2). ఇతని పైన ముదివేడు PS లో మర్డర్ కేసు కలదు.
3).కర్ణాటక రాష్ట్రము రాయల్పాడు పోలీస్ స్టేషన్ లో లిక్కర్ కేసు కలదు.
అంతేకాకుండా ఇతని పైన ముదివేడు పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ కలదు.
స్వాధీనము చేసుకొన్న సొత్తు వివరాలు:
1). Cr.No: 67/2025 U/s 331(4), 305(a) BNS of Mudivedu PS.
బంగారం: దాదాపు 743 గ్రాములు, దీని విలువ దాదాపు రూ.67,50,000/-
హాక్సా బ్లేడ్లు -02
కిటికీ ఇనుప గ్రిల్.
ముత్తూట్ ఫిన్‌కార్ప్ బంగారు రసీదు కాపీ.
సదరు పై వస్తువులను పైన తెలిపిన ఐదు మంది వ్యక్తుల వద్ద స్వాదీనము చేసుకోవడమైనది.
2). Cr.No: 69/2025 U/s 331(4), 305(a) BNS of Mudivedu PS.
బంగారం: సుమారు 92 గ్రాములు, సుమారు రూ.7,50,000/-
సదరు బంగారు వస్తువులను A3.ముద్దాయి అయిన కన్నెమడుగు కిషోర్ వద్ద స్వాదీనము చేసుకోవడమైనది
మొత్తము సుమారు Rs.75,00,000/- విలువ గల సుమారు 835 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనము చేసుకోవడమైనది.
పైన తెలిపిన ముద్దాయిలు అందరూ చిన్న వయస్సు లోనే విలాసవంతమైన జీవితానికి మరియు క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి డబ్బుల కోసం నేరాలను చేస్తున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై అనునిత్యం దృష్టిసారించాలి. క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై నిరంతరం పోలీస్ ల నిఘా పెట్టడం జరిగింది.
దొంగతనాలను నివారించేందుకు విజిబుల్ పోలీసింగ్ మరియు పోలీస్ పెట్రోలింగ్ లను పెంచడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా అన్ని చర్యలు తీసుకొంటామని తెలియచేస్తూ.. ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే వెంటనే ఆ సమాచారాన్ని పోలీస్ లకు తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) యం.వెంకటాద్రి ప్రజలకు సూచించారు.
ప్రశంశలు..
ఈ కేసులను సేదించడంలో తీవ్రంగా శ్రమించి, చాకచక్యంగా ముద్దాయిలను పట్టుకున్నందుకు పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా అదనపు ఎస్పి యం.వెంకటాద్రి అభినందించారు.