రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం


నిడదవోలులో రైతులకు రూ. 1.99 కోట్ల విలువైన 100 వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి

నిడదవోలు నియోజకవర్గంలో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

త్వరలో రైతుల నుండి మిగులు ధాన్యం కొనుగోలుకు చర్యలు

వారం రోజుల్లో రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు

కౌలు రైతులను ఆదుకునేందుకు ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం సిద్ధం

త్వరలో అన్నదాత సుఖీభవ క్రింద రైతుల ఖాతాల్లో రూ.20,000 జమ

మంత్రి కందుల దుర్గేష్

శింగవరం గ్రామంలో రూ. 53.08 లక్షల అంచనా వ్యయంతో జలజీవన్ మిషన్ పథకం క్రింద ఏర్పాటు చేసిన 60000 లీటర్ల సామర్థ్యం గల మంచి నీటి ట్యాంక్, పైపులైనులు, బోరు మరియు కుళాయిల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

శింగవరంలో రూ. 22.34 లక్షల విలువైన 11 యంత్ర పరికరాలు సబ్సీడీకి అందజేత

నిడదవోలు: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.ఆదివారం నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలంలోని శింగవరం గ్రామంలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నదాత సుఖీభవ పథకం వివరాలు, ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం, రైతన్నలకు యంత్ర పరికరాల పంపిణీ, నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల అంశం తదితర వివరాలు మాట్లాడారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో రూ. 53.08 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు మండలం శింగవరం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం క్రింద ఏర్పాటు చేసిన 60000 లీటర్ల సామర్థ్యం గల మంచి నీటి ట్యాంక్, పైపులైనులు, బోరు మరియు కుళాయిల ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు శింగవరం గ్రామ సభ్యులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. శింగవరం గ్రామంలో మొత్తం 720 ఇళ్లకు గానూ 2348 మంది జనాభా నివసిస్తున్నారని, గ్రామానికి మొత్తం 3 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ ట్యాంక్ లు మంజూరు అయ్యాయని అందులో భాగంగా తొలుత 60,000 లీటర్లతో కూడిన ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ ట్యాంక్ ను నిర్మించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. దానికి అనుసంధానంగా బోర్ తో పాటు 840 మీటర్ల పొడవైన పైపులైను వేశామన్నారు. 32 కుళాయి కనెక్షన్ లు ఇవ్వడం జరిగిందన్నారు.త్వరలోనే 40,000 లీటర్ల, 20000 లీటర్ల ట్యాంక్ ల నిర్మాణం చేపడతామని, పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అందులో భాగంగా వ్యవసాయాధారిత నియోజకవర్గమైన నిడదవోలులో రైతులకు రూ.1.99 కోట్ల విలువైన 100 యంత్ర పరికరాలు సబ్సిడీ క్రింద అందించామని తెలిపారు. ఇందులో ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ. 85.13 లక్షలు అన్నారు. నిడదవోలు మండలంలో రూ. 85.60 లక్షల విలువైన 42 యంత్ర పరికరాలు పంపిణీ చేయగా అందులో సబ్సిడీ రూ.36.24 లక్షలు అని తెలిపారు. సింగవరం గ్రామంలో రూ. 22.34 లక్షల విలువైన 11 యంత్ర పరికరాలు పంపిణీ చేశామని, అందులో ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.9.50 లక్షలు అని వివరించారు. అధికారులతో ప్రత్యేకంగా చర్చించి నిడదవోలు నియోజకవర్గానికి పెద్దసంఖ్యలో యంత్రపరికరాలు అందించే ఏర్పాటు చేశామన్నారు. రైతు సేవా కేంద్రాల ఏర్పాటు ద్వారా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి చేశామన్నారు. అందులో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిడదవోలు నియోజకవర్గంలోనే కొనుగోలు చేశామన్నారు. త్వరలో రైతుల నుండి మిగులు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడానని తెలిపారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలన్న రైతుల విజ్ఞప్తిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. రైతులందరికీ మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.

గతంలో రైతు భరోసా క్రింద కేవలం రూ.13,000 ఇచ్చేవాళ్లని, ప్రస్తుతం కేంద్రం అందించే రూ.10,000 సాయంతో కలిపి కూటమి ప్రభుత్వం మరో రూ.10,000 జత చేసి రైతాంగానికి రూ.20,000 ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.  

ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం.. త్వరలోనే రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు

మరో వారం రోజుల్లో రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ వస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.ఎర్రకాలువ ముంపుకు శాశ్వత,దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తున్నామని వివరించారు. త్వరలో జరిగే కేబినెట్ దృష్టికి ఇన్ ఫుట్ సబ్సిడీ అంశం తీసుకువెళ్లి చర్చిస్తానన్నారు. కౌలు రైతుకు పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 2024 జులైలో సంభవించిన భారీ వర్షాల ధాటికి ఎర్రకాలువ ముంపుకు గురై రైతాంగాన్ని ఛిన్నాభిన్నం చేసిందని తెలుపుతూ వారందరికీ ఇన్ ఫుట్ సబ్సిడీ అందిస్తామని నాడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఈ క్రమంలో తనతో పాటు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. అయితే ఆగస్టు నెలలో తలెత్తిన భారీ వర్షానికి నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ అందించామని కానీ జులై నెలలో సంభవించిన నష్టానికి ఇన్ పుట్ సబ్సిడీ అందించే విషయంలో ఎదురైన అడ్డంకులను వివరించారు.ఈ అంశాన్ని ప్రతి కేబినెట్ దృష్టికి తీసుకెళ్తున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు సుముఖంగా ఉండి అధికారులను ఆదేశించినప్పటికీ గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ప్రస్తుతం రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించేందుకు ఆర్థిక శాఖలో సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు. ఏది ఏమైనా రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించి తీరుతామన్నారు.

కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ తో పాటు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-