కష్టపడిని ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయి
కష్టపడిని ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయి
కొల్లు రవీంద్ర, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ ల మంత్రి
ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ ప్రమాణ స్వీకార వేడుకలు విజయవాడ లోని ఐలాపురం హోటల్ లో ఏర్పాటు చేశారు.. ఈ వేడుకల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనడానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేటీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ అని అన్నారు... సుగుణమ్మ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకుంటున్నానన్నారు. కూటమి పొత్తులో భాగంగా సీటు కోల్పోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించడంలో సుగుణమ్మ అత్యంత కీలకంగా వ్యవహరించారన్నారు. గతంలో శాసనసభ్యులుగా తిరుపతి ప్రజలకు సేవలు అందించారన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు.. రాష్ట్రాన్ని పచ్చదనంగా మార్చేందుకు సుగుణమ్మ చర్యలు తీసుకోవాలన్నారు.. ఆమె పర్యవేక్షణలో పరిశుభ్రత, పచ్చదనంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సన్మాన వేడుకలో మన్నూరు సుగుణమ్మ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పదవి ఇచ్చి నాకు గురుతర బాధ్యతను అప్పగించారన్నారు. నాకిచ్చిన పదవి కి సంపూర్ణ న్యాయం చేసేందుకు నూటికి నూరు శాతం చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. రాజధాని అమరావతి ని పచ్చదనం తో నింపేందుకు తన వంతు కష్టపడి పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు, ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని కాపాడుకుని పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పచ్చదనాన్ని కాపాడుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నారు. నన్ను ప్రత్యేకంగా గుర్తించి ఈ పదవి ఇచ్చి మన అందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గౌరవాన్ని కల్గించారన్నారు. సుందర, వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానన్నారు. నాకిచ్చిన ఈ బాధ్యతను నూటికి నూరు శాతం నెరవేర్చుతానన్నారు. నాకు ఇచ్చిన పదవికి తప్పని సరిగా న్యాయం చేస్తానని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన మన్నూరు సుగుణమ్మ ను ఘనంగా సన్మానించిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, అభిమానులు లతోపాటు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని , శ్రావణి, ఎమ్మెల్సీ గ్రీష్మ, ఐలాపురం వెంకయ్య తదితరులు ఉన్నారు.