ఇంటికొక పారిశ్రామిక వేత్త తయారు కావాలి
ఇంటికొక పారిశ్రామిక వేత్త తయారు కావాలి
పరిశ్రమలతోనే ఉపాధి అవకాశాలు
రాష్ట్రానికే పుట్టపర్తి పారిశ్రామికవాడ రోల్ మోడల్ కావాలి
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి :
ఇంటికొక పారిశ్రామికవేత్త ను తయారుచేద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మండలం కప్పల బండ సమీపంలో ఏపిఐఐసి ఆధ్వర్యంలో సూక్ష్మ ,చిన్న మధ్యతర పరిశ్రమల వాడ జిల్లా కలెక్టర్ టీ ఎస్ చేతన్ , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, పుట్టపర్తి సమీపంలోని కప్పలబండ పారిశ్రామికవాడలో 104 ఎకరాలలో రూ 154 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు అయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలతో పాటు ఆదాయ రంగం పెరిగి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. పుట్టపర్తి పారిశ్రామికవాడ ఆంధ్ర ప్రదేశ్ రోల్ మోడల్ కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న పారిశ్రామిక వేత్తలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, 2014 నుంచి 2018 వరకు అప్పటి టిడిపి ప్రభుత్వం హయాంలో కప్పల బండ వద్ద 104 ఎకరాలు సేకరించి పారిశ్రామిక వార్డును ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా తయారైంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దూర దృష్టితో పారిశ్రామిక సంఘాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్నారు.ప్రతి ఒక్కరు ఉత్పత్తిని రంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గం వైపు పయనించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ, పరిశ్రమలు వస్తె మన ప్రాంతం అభివృద్ధి చెంది ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఈ పారిశ్రామిక వేత్తలు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. పుట్టపర్తి సమీపంలో కప్పల బండ ప్రాంతంలో పారిశ్రామిక వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సువర్ణ ఏపీఐఐసీసీ జోనల్ మేనేజర్ సోనీ ఏపీఐఐసీ, డీఐసి అధికారులు పాల్గొన్నారు.
