నేర పరిశోధనలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరనే కీలకం...
నేర పరిశోధనలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరనే కీలకం...
జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ ..
జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో " ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ " పై ఒకరోజు వర్క్ షాప్
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు, సిబ్బందికి అవగాహనకు ఫోరెన్సిక్ నిపుణులచే ఒక్క రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు
జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ మాట్లాడుతూ..
టెక్నాలజీ ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమైన కేసుల దర్యాప్తునకు నేర పరిశోధనలో సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలే ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న ఐపిఎస్ గారు దర్యాప్తు అధికారులకు సూచించారు.
పోలీసు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దర్యాప్తు పద్ధతులపై లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఫోరెన్సిక్ శిక్షణ వల్ల ఆధారాల విలువలపై స్పష్టత కలిగి, నేర విచారణను బలపర్చే శక్తి లభిస్తుంది అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జిల్లాలో నేర విచారణ ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి ఎంతో దోహదపడతాయన్నారు.
మారుతున్న పరిస్థితులు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో కేసులు దర్యాప్తు ఉండాలని ఎస్పీ గారు అభిప్రాయపడ్డారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ,తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫోరెన్సిక్ నిపుణులు తెలియజేశారు.
అధికారులు, దర్యాప్తు సమయంలో వారికి ఎదురయ్యే సందేహాలను నిపుణులతో నివృత్తి చేసుకున్నారు.
అనంతపురం RFSL ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఆఫీసర్ కుల్లాయమ్మ , అశోక్ కుమార్ , మంగళగిరి నుంచి వచ్చిన F S L సైంటిఫిక్ అసిస్టెంట్స్ మురళీ, వెంకటేశ్వరరావులు విలువైన సలహాలు/ సూచనలు అందించారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు, ఫోరెన్సిక్ నిపుణులు కు శాలువాతో సత్కరించి జ్ఞాపి కలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ విజయ్ కుమార్ , ట్రైనీ డిఎస్పి ఉదయ పావని ,dcrb ci శ్రీనివాసులు ,ఫింగర్ ప్రింట్ ఎస్ఐ అనిల్ కుమార్ జిల్లాలోని సి.ఐ లు, ఎస్సైలు, A S I లు ,సిబ్బంది, సైబర్ విభాగం, ఐటి కోర్ టీం, ఫింగర్ ప్రింట్స్ అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.
పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం.
