వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా – పోలీస్ సేవలు ఇక మీ చేతిలోనే!
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా – పోలీస్ సేవలు ఇక మీ చేతిలోనే!
WhatsApp నంబర్: 95523 00009
మీరు ఇకపై మీ ఎఫ్‌ఐఆర్ (FIR) ను వేగంగా, సులభంగా డిజిటల్ రూపంలో పొందవచ్చు. ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేదు – మీ మొబైల్ నుండే పోలీస్ సేవలను పొందండి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా “ప్రజల సేవలో స్మార్ట్ పోలీసింగ్ – ఇప్పుడు వాట్సాప్‌లోనే” కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కొత్త డిజిటల్ సేవల ద్వారా ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడం లక్ష్యం.
పోలీస్ సేవలు పొందడం ఎలా?
స్టెప్ 1: మీ మొబైల్ నుంచి 95523 00009 నెంబర్‌కు "Hi" అని వాట్సాప్‌లో మెసేజ్ చేయండి.
స్టెప్ 2: వచ్చిన మెనూ నుంచి "Citizen Services" లేదా పౌర సేవలు ఎంపిక చేయండి.
స్టెప్ 3: అందుబాటులో ఉన్న సేవల నుంచి మీరు అవసరమైన సేవను ఎంచుకోండి. ఉదాహరణకు:
ఎఫ్‌ఐఆర్ డౌన్లోడ్,
ఎఫ్‌ఐఆర్ స్థితి తెలుసుకోవడం.
స్టెప్ 4: అవసరమైన వివరాలు నమోదు చేసి సమర్పించండి. వెంటనే మీ మొబైల్‌ఫోన్‌లో ఎఫ్‌ఐఆర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా దాని స్థితి తెలుసుకోవచ్చు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మాట్లాడుతూ:
"పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఈ డిజిటల్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలని కోరుతున్నాం. అన్ని పోలీస్ స్టేషన్లలో సంబంధిత సమాచారం, పాంఫ్లెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు."
మీరు కూడా ప్రయోగించండి – పోలీస్ సేవలు ఇప్పుడు కేవలం ఒక మెసేజ్ దూరంలో!