Health News: పనీర్ తో కలిగే లాభాలు ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు..!
Health News: పనీర్ తో కలిగే లాభాలు ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు..!
బయటికి వెళ్లినప్పుడు చాలా మంది తినే ఆహారాల్లో పనీర్ కూడా ఒకటి. పనీర్‌తో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. ఎక్కువగా మసాలా, రైస్ వంటకాలను పనీర్‌తో తయారు చేస్తారు. అయితే పనీర్‌ను మనం ఇంట్లోనూ పలు రకాలుగా వండుకోవచ్చు. ఇక పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం పనీర్ మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలను పనీర్ అందిస్తుంది. పనీర్‌ను తీసుకుంటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. మాంసాహారం తినలేని వారు పనీర్‌ను తింటే ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. 100 గ్రాముల పనీర్ ద్వారా ఏకంగా 20 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు.
క్యాల్షియం అధికంగా..
ప్రోటీన్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. దీంతో కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు పనీర్ ను ఆహారంలో భాగం చేసుకుంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. కండరాలు నిర్మాణం అవుతాయి కనుక చక్కని దేహాకృతిని పొందుతారు. పనీర్‌ను తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పనీర్‌లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌ను తింటే సుమారుగా 700 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం పొందవచ్చు. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తుంది. అలాగే దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
షుగర్ నియంత్రణలో..
పనీర్‌లో ఉండే ఫాస్ఫరస్ ఎముకల్లో సాంద్రతను పెంచుతుంది. దీంతో ఎముకలు పటిష్టంగా మారుతాయి. పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పనీర్‌ను తింటుంటే షుగర్ లెవల్స్ సైతం అదుపులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పనీర్ తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే షుగర్ లెవల్స్ అంత త్వరగా పెరగవు. పైగా ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు షుగర్ లెవల్స్‌ను తగ్గేలా చేస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
విటమిన్లు పుష్కలంగా..
పనీర్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జింక్, విటమిన్లు ఎ, డి, బి12 అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి బయట పడవచ్చు. పనీర్‌లో ఉండే విటమిన్ బి12 మెదడును యాక్టివ్‌గా మారుస్తుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. వెజిటేరియన్లు చాలా మందిలో విటమిన్ బి12 లోపం ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ తినరు కనుక. కానీ పనీర్‌లో విటమిన్ బి12 ఉంటుంది కనుక వారిలో ఏర్పడే ఈ విటమిన్ లోపాన్ని పనీర్‌తో అధిగమించవచ్చు. పనీర్ విటమిన్ బి12 లోపాన్ని సరిచేసి రక్తం తయారయ్యేలా చేస్తుంది. మెడ, భుజాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇలా పనీర్ వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.