Tamarind Leaves: చింత చిగురు తో ఇన్ని ఆరోగ్య ఉపయోగాలా..!
Tamarind Leaves: చింత చిగురు తో ఇన్ని ఆరోగ్య ఉపయోగాలా..!
Tamarind Leaves: చింత పండును మనం అనేక రకాల కూరల్లో వేస్తుంటాం. ముఖ్యంగా పప్పు, పులుసు, చారు వంటి వంటల్లో చింత పండును ఎక్కువగా వేస్తుంటారు. చింత పండు వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే చింత పండే కాదు, చింత చిగురు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సీజన్ లో చింత చిగురు ఎక్కువగా లభిస్తుంది. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా పొందవచ్చు. చింత చిగురుతో పప్పు, పచ్చడి చేసి తింటారు. దీంతో కొందరు పులిహోర చేస్తారు. అలాగే అందులో మాంసం వేడి కూడా వండుతారు. ఈ వంటకాలు అన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే చింత చిగురును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. చింత చిగురులో అనేక సమ్మేళనాలు, పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వాపులు, నొప్పులు తగ్గేందుకు..
చింత చిగురులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, బెణుకులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపులు కూడా తగ్గుతాయి. చింత చిగురును తింటున్నా లేదా చింత చిగురును మెత్తగా చేసి పట్టీలా వేసి కట్టు కడుతున్నా కూడా నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చింత చిగురులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. చింత చిగురును రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. చర్మ సమస్యలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా చుండ్రు, దురద, గజ్జి, తామర వంటివి తగ్గిపోతాయి.
జీర్ణ వ్యవస్థకు..
చింత చిగురులో ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలు దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. చింత చిగురు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరిచి అజీర్తిని తగ్గిస్తుంది. చింత చిగురును ఆహారంలో భాగం చేసుకుంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవడమే కాదు, ఆకలి కూడా పెరుగుతుంది. ఆహారం తినాలన్న కోరిక పెరుగుతుంది. సైంటిస్టుల అధ్యయనాలు చెబుతున్న ప్రకారం చింత చిగురును తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్‌ను తగ్గించుకోవచ్చు.
జ్వరం వచ్చిన వారికి..
చింత చిగురును జ్వరం తగ్గేందుకు కూడా ఉపయోగిస్తారు. పూర్వకాలంలో చింత చిగురుతో తయారు చేసిన సూప్‌ను తాగించేవారు. దీంతో జ్వరం వచ్చిన వారికి ఉపశమనం లభిస్తుంది. త్వరగా కోలుకుంటారు. చింత చిగురును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు తగ్గుతాయి. చింత చిగురులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఊపిరితిత్తుల వాపులను తగ్గిస్తాయి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. చింత చిగురు అనాల్జెసిక్‌గా కూడా పనిచేస్తుంది. అంటే దీన్ని తింటే శరీరంలోని నొప్పులను తగ్గిస్తుందన్నమాట. అలాగే చింత చిగురులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను తగ్గిస్తుంది. కనుక ఈ సీజన్‌లో మీకు ఎక్కడైనా చింత చిగురు కనిపిస్తే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి.