ఆగస్టు 15 నాటికి ధరణి నుంచి విముక్తి కల్పిస్తాం..
ఆగస్టు 15 నాటికి ధరణి నుంచి విముక్తి కల్పిస్తాం..
భూభారతితో భూసమస్యలకు మన ప్రజా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుంది.
ఈరోజు మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూభారతి సర్వే ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది.
మంగళవారం రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విలేజ్ లో అధికారులే మీ గ్రామానికే వచ్చి సర్వే చేస్తారు.ఇక మీదట ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగనవసరంలేదు. ప్రతి రైతు భూమికి ఒక భూధార్ నెంబర్ ఇస్తాం. రాష్ట్రం లో 413 రెవెన్యూ గ్రామాలలో నక్షలు లేవు, అయిదు గ్రామాలను నక్షల కోసం సర్వే చేసేందుకు ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ములుగుమాడుకు కూడ ఒక్క నక్ష తయారు చేసి ఇస్తాం. ప్రతీ రెవెన్యూ విలేజ్ కి ఒక గ్రామపాలన అధికారిని నియమిస్తాం. 3,556 మంది నియామకం చేస్తున్నాం. ఇక ప్రభుత్వ రెవెన్యూ అధికారులు రైతులకు అండగా వారి భూములకు కాపలాదారుడుగా ఉంటారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేకున్నా ఉన్నట్లుగా చిత్రీకరించారు ఆ నాటి ప్రభుత్వం నేతలు. రైతుబంధు కోసం పెద్దల సహకారంతో అక్రమాలు చేశారు. ఆనాడు ఇందిరమ్మ పేరుతో పేదలకు ఇచ్చిన భూములను ధరణితో అక్రమంగా తారు మారు చేశారు.
ఈ చట్టం పేదల చుట్టం మాదిరిగా పని చేస్తుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ లో కూడా మార్పులు తీసుకువస్తున్నాం. స్లాట్ బుకింగ్ పెట్టి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రకియ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తూనే కొత్త పథకాలు అందిస్తున్నాం.