2014-19 మధ్యలో ఉపాధి హామీ బకాయిల సమస్య పరిష్కరించాలి
2014-19 మధ్యలో ఉపాధి హామీ బకాయిల సమస్య పరిష్కరించాలి
పామ్ ఆయిల్ దిగుమతులపై సుఖం సవరించాలి
రెడ్ గ్రామ్ కంది దినుసుల సేకరణ గడువు పెంచాలి
వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో రామ్మోహన్ నాయుడు భేటీ
బుధవారం రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో రాష్ట్ర రైతుల సమస్యల చర్చించేందుకు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మూడు ప్రధాన అంశాల మీద ఇరువురి చర్చ సాగింది.
2014-19 సంవత్సరాల మధ్య ఉపాధి పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరించి నిధులు విడుదల చేయాలని కోరారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఎడిబుల్ ఆయిల్ పై దిగుమతి సుఖం 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించటం వల్ల దేశీయంగా పంట ఉత్పత్తి చేస్తున్న రైతులు మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల నష్టపోతారని, ఆ సుంఖాన్ని పాత రేటు ప్రకారం కొనసాగించాలని కోరారు. అలాగే జాతీయ వ్యవసాయ కార్పోరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ (NAFED) ద్వారా సేకరించి పప్పు దినుసులు ముఖ్యంగా రెడ్ గ్రామ్ గడువు ఈనెల జూన్ 15తో ముగియనుందని రైతుల సౌకర్యం దృశ్య సేకరణ గడువు మరింత పెంచాల్సిందిగా కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ సానుకూలంగా స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.