ఖరీఫ్ 2025 – ఈ - పంట- డిజిటల్ క్రాప్ సర్వే
ఖరీఫ్ 2025 – ఈ - పంట- డిజిటల్ క్రాప్ సర్వే
-మార్గదర్శకాలు జారీ చేసిన వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్
కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ 2025 సీజన్‌కు సంబంధించి చేబట్టబోయే ఈ e-పంట డిజిటల్ క్రాప్ సర్వే కి సంబంధించి విధివిదా నాలను ,మార్గ దర్శకాలను వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు తెలియచేశారు.
జూలై నెల మొదటి వారంనుండిప్రారంభమయ్యే ఖరీఫ్ 25 సీజన్ పంటల నమోదును డిజిటల్ విధానములో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో NIC (జాతీయ ఇన్ఫర్మాటిక్స్ కేంద్రం) సంస్థ సాంకేతిక మద్దతుతో పూర్తిగా డిజిటల్ విధానంలో మరింత ఖచ్చితంగా,పార దర్శకంగా ఉండేలా పంటల నమోదును నిర్వహించనున్నారు.
ఈ డిజిటల్ విధానములో సాగుకు యోగ్యం కాని వ్యవసాయేతర భూములు మరియు ప్రభుత్వ భూములను వివరాలను తొలగించి కేవలం సాగుకు అనుకూలమైన భూముల వివరాలను మాత్రమే NIC డిజిటల్ క్రాప్ సర్వే కు అనుసంధానించటం జరిగింది .
డిల్లీ రావు మాట్లాడుతూ. ఈ-పంట - డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సాగు భూములలో పంటల స్థితిగతులపై ఖచ్చితమైన డేటా సేకరించడం, రైతుల సంక్షేమ పథకాల అమలుకు దోహద పడే *ఈ పంట డిజిటల్ పంటల నమోదు సాగు వివరములను మరింత సమర్థవంతంగా చేయడం ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు .
ఈ - పంట సర్వే లక్ష్యాలను తెలుపుతూ
100 శాతం పంటల నమోదుతో వ్యవసాయ పంటల సాగు పరిపూర్ణ సమాచార డేటా సేకరించడం
రైతుల e-KYC పూర్తి చేసి, ఆధార్ మరియు మొబైల్ డేటాను అప్డేట్ చేయడం
భూమి హక్కుల ఆధారంగా (Webland / RoFR) ఖచ్చితమైన భూమి వివరాలు నమోదు చేయడం
సాగు/ సాగు లో లేని భూముల వర్గీకరణ (విత్తిన పంట విస్తీర్ణం,బీడు, ఆక్వా సాగు , వ్యవసాయేతర అంశములు) వివరాలు సేకరించడం
డిజిటల్ పంటల సర్వే ముఖ్యాంశాలు
బహువార్షిక పంటల నమోదు విషయములో :
గత సంవత్సరం నమోదు చేసిన అరటి , కొబ్బరి,మామిడి వంటి బహు వార్షిక ఉద్యాన పంటలను ఈ ఏడాదికి కూడా నమోదు చేయడానికి తాజాగా జియో ఫెన్సింగ్ తో ఫీల్డ్ సర్వే చేసి ఫోటో తీయాలి .
ఈ నూతన డిజిటల్ పంట నమోదులో పొలం గట్ల మీద ఉన్న చెట్లు మరియు సాగు చేసిన పంటను కూడా మొదటిసారిగా అమలు లోనికి తీసుకుని రావడం జరిగింది .
భూముల అనుమతి ఆధారాలు:
వెబ్లాండ్ భూమి పోర్టల్/ అటవీ భూమి రిజిస్టర్ పోర్టల్ ఆధారంగా భూముల అనుమతులు పరిశీలించాలి. ప్రభుత్వ భూములు, లీజు భూములు, ఇతర అభ్యంతరకర స్థలాల్లో సాగు చేశివుంటే ప్రత్యేక పరిశీలన జరగాలి.
పంట స్థితి వర్గీకరణ:
సర్వేలోని భూములను పంట సాగుతో ఉన్నవిగా లేదా లేనివిగా వర్గీకరిస్తారు – పంట తో వున్న భూమి / పంటలేని భూమి / ఆక్వా సాగు / వ్యవసాయేతర / సాగులో లేని బీడు .
చిన్న కమతపు భూముల పరిశీలన:
0.25 ఎకరాల కంటే తక్కువ భూముల్లో పంట ఉనికి నిర్ధారణ తప్పనిసరి.పంట ఉన్నా లేకపోయినా భూ కమతాలకు జియో టాగ్ చేసిన ఫోటో తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు .
సర్వే ను పరిశీలన& ఆమోదం తెలిపే అధికారులు:
వ్యవసాయ పంటలు - మండల వ్యవసాయ అధికారి
ఉద్యాన పంటలు - ఉద్యాన అధికారి
ఇతర ప్రభుత్వ / వ్యవసాయం కాని భూములు -- తహసీల్దార్ ల పరిశీలన :; వీరిచే తిరస్కరణకు గురయ్యి ,తిరిగి క్షేత్ర స్థాయి సిబ్బందిచే రీసర్వే చేసిన వాటి వివరముల
సమీక్ష మరియు ఆమోదం కొరకు - సహాయ వ్యవసాయ సంచాలకులు లేదా జిల్లా ఉద్యాన అధికారులు .
సచివాలయల పునర్విభజన కు అనుగుణముగా మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం సిబ్బందిని రెవెన్యూ గ్రామానికి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది.
రైతులకు సూచనలు:
వ్యవసాయ దారుల సాగు సమాచార డేటా తప్పనిసరి
ఆధార్ నంబరు, మొబైల్ నంబరు ఖచ్చితంగా నమోదు చేయాలి
తమ సాగు భూములకు సంబంధించిన పంటలు తప్పనిసరిగా 100శాతం నమోదు చేయించుకోవాలి
ఏవైనా సమస్యలు / సందేహాలుంటే స్థానిక రైతు సేవాకేంద్రం, మండల వ్యవసాయ/ఉద్యాన అధికారి, తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలి
చివరగా డిల్లీ రావు మాట్లాడుతూ ఈ డిజిటల్ పంటల సర్వే ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను సులభంగా గుర్తించి, రైతులకు నేరుగా ప్రయోజనాలు అందే విధంగా ప్రభుత్వ పాలనను ప్రభావవంతంగా అమలు చేయవచ్చు అని తెలిపారు .
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి రైతు భాగస్వామ్యం కీలకం అని తెలిపారు
రైతులు వెంటనే తమ పంటల వివరాలు సాగు చేసిన పంట రకముతో సహా నమోదు చేయించుకోగలరని తెలిపారు . ఈ కే వై సి తప్పనిసరి కాదని తెలుపుతూ ,వ్యవసాయ దారుల డేటా సమాచారం ఖచ్చితంగా ఉండాలని తెలిపారు .
చివరగా మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో అధికారులు తప్పుగా పంటల సాగు విస్తీర్ణం ,పంట సాగు రకం నమోదు ,100శాతం పంట సర్వే నమోదు చేయకపోవడం లాంటి వాటిని తీవ్రముగా పరిగణించి చర్యలు తీసుకుంటామని తెలిపారు .అన్ని స్థాయిలలో పర్యవేక్షణ ఉండాలని ,ప్రతి ఉద్యోగి బాధ్యతగా వ్యవహరించాలని కోరారు .