రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింభించేలా 2047 విజన్ ప్రణాళికలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 ప్రజల ఆకాంక్షలను ప్రతిబింభించేలా 2047 విజన్ ప్రణాళికలు

  • 2047 కల్లా దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్ధానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష..
  • నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు..
  • స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికపై సమీక్షా సమావేశంలో అధికారులకు దిశా, నిర్ధేశం..
  • నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్ మెంట్ ప్లాన్ ఆవిష్కరణలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి..


నూజివీడు, జూన్, 26.. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింభించేలా నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్ మెంట్ ప్లాన్ ను రూపొందించినట్లు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. గురువారం సాయంత్రం నూజివీడు రోటరీ కళ్యాణ మండపంలో జిల్లా, నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలిఅడుగు కింద నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్ మెంట్ ప్లాన్ ఆవిష్కరణ-చర్చా- సమాలోచన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూజివీడు నియోజకవర్గ స్ధాయిలో అభివృద్ధిపనులకు సంబంధించి రాష్ట్రస్ధాయిలో రాష్ట్ర విజన్ యాక్షన్ ప్లాన్ జిల్లాస్ధాయిలో జిల్లావిజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ స్ధాయి లో నియోజకవర్గ విజన్ ప్లాన్ ను రూపొందించడం జరిగిందన్నారు. అందరి సహకారంతోనే స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళిక అమలు సాధ్యమన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల విధ్వాంస పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారద్యంలో స్వర్ణాంధ్రగా మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రణాళిక తయారీలో అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో అధికంగా ఉన్న వ్యవసాయం, ఉధ్యానవన, పర్యాటక, మత్స్యరంగాలను మరింత విస్తరింపచేయవచ్చన్నారు. అన్ని వర్గాల సూచనలు తీసుకొని సమగ్ర ప్రణాళికను రూపొందిస్తే రాబోయే 22 ఏళ్లలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని కాట్రేని పాడు ఎన్ఎస్ పి,వేంపాడు కాలువ పనులు అవసరం ఐతే తన సొంత సొమ్ము రూ 30 లక్షలతో తవ్విస్తామని ఈ సందర్బంగా మంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. నూజివీడు నియోజకవర్గంలో ఉపాధిహామీ కింద రూ. 30.12 కోట్లతో సిసిరోడ్లు, నిర్మాణం, రూ. 3.55 కోట్లతో గోకులం షెడ్లు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఆర్ అండ్ బి రోడ్ల పుననిర్మాణం, గుంతల పూడికకోసం ప్రభుత్వం రూ. 30 కోట్లు కేటాయించిందన్నారు. నూజివీడు ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.75 కోట్లు కేటాయించిందన్నారు. జెజెఎం కింద రక్షిత మంచినీటి పధకాలకోసం రూ. 13.21 కోట్లు, జిల్లా పరిషత్ నిధులు రోడ్లు, డ్ర్రైయిన్ లు మంచినీటి వసతి కోసం రూ. 3.55 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. నాబార్డు నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ రోడ్ల అభివృద్ధికోసం రూ. 5 కోట్లు కేటాయించిందన్నారు. నూజివీడు పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి మొత్తం రూ. 5 కోట్లు కేటాయించబడ్డాయన్నారు. నూజివీడు పట్టణ మంచినీటి అవసరాలు తీర్చడం కోసం అమృత-2 పధకం కింద వెల్వడం నుండి ఈదర వరకు పైపులైన్ నిర్మాణం కోసం రూ. 13.22 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. బోర్వంచ గ్రామ పంచాయితీ పరిధిలోని కొన్నంగుంట గ్రామం వద్ద డ్రైన్ నిర్మాణం కోసం డిఎంఎఫ్ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. నూజివీడు రూరల్ మండలంలో మంచినీటి సౌకర్యాల కోసం డిఎంఎస్ నిధుల నుంచి రూ. 29 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి స్కూల్ కౌంపాండ్ వాల్స్, అధనపు తరగతుల నిర్మాణం కోసం రూ. 2.22 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. నూజివీడు నియోజవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బి.సి., ఈడబ్ల్యూఎస్, మైనారిటీ విద్యార్ధులకోసం స్కాలర్ షిప్ రూపంలో రాష్ర ప్రభుత్వ నిధులనుంచి రూ. 9.91 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్ర్రామీణ ఉపాధిహామీ పధకం కింద నూజివీడు నియోజకవర్గంలో 20 లక్షలకు మించి పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల కింద ఏడాది కాలంలో రూ. 170 కోట్లు వివిధ రూపాల్లో పెన్షన్లు అందించామన్నారు. అదే విధంగా వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 360 మందికి రూ. 2.25 కోట్లు, ఎల్ఓసి ల కింద 48 మందికి రూ. 93 లక్షలు వెరశి రూ.3.19 కోట్లు అందించడం జరిగిందన్నారు.  

 సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ్ రాజ్, డిఎఫ్ఓ శుభం, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదరనాయుడు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, గొర్రెలు, మేకలు కార్పోరేషన్ అధనపు డైరెక్టర్ సూర్యకుమారి, నూజివీడు సివిడిపి నోడల్ అఫీసరు, జెడ్పి సిఇఓ ఎం. శ్రీహరి, ఎల్ డిఎం డి. నీలాధ్రి, స్ధానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-