చంద్రగిరి కోట నందు సుమారు 3 వేల మందితో పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ
చంద్రగిరి కోట నందు సుమారు 3 వేల మందితో పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ
- ఉత్సాహంగా యోగ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు యువత, మహిళలు, విద్యార్థులు
- ప్రతి ఒక్కరి దైనoదిన జీవితoలో యోగ ఒక భాగం కావాలి
- జిల్లా అంతటా యోగాంధ్రకు సంబందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
- యోగాను రోజువారీ దిన చర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుంటుంది : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
- మానసిక ఒత్తిడిని జయించేలా ప్రతి ఒక్కరు యోగ చేయాలి : తుడా ఛైర్మెన్ డాలర్ దివాకర్ రెడ్డి
- ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి యోగను దిన చర్య గా చేసుకోవాలి : రాష్ట యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్
- చంద్రగిరి,జూన్ 4 : ప్రతి ఒక్కరి దైనoదిత జీవితoలో యోగ ఒక భాగం కావాలి అని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ పిలుపునిచ్చారు.
బుధవారం చంద్రగిరి కోట నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025 కార్యక్రమము లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ప్రజలు, జిల్లా అధికారులు,విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరి దైనoదిత జీవితoలో యోగ ఒక బాగం కావాలి అని, జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవo పురస్కరించుకొని మన రాష్ట్రమంతట యోగాంధ్ర క్యాంపెన్ లో భాగంగా తిరుపతి జిల్లాలో ఈరోజు మనం చంద్రగిరి కోటలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజులు పాటు అంత రాష్ట్రవ్యాప్తంగ, జిల్లా మండల, గ్రామ స్థాయి వరకు యోగా ప్రాముఖ్యతను గురించి ప్రతి ఒక్కరికి శిక్షణ, అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా యోగ ఉండాలని ఉద్దేశంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని తెలిపారు. సచివాలయం పరిధి,వార్డు పరిధి లో అందరికీ యోగా గురించి శిక్షణ, అవగాహన కల్పిపిస్తున్నామని అందులో భాగంగానే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ జరిగింది అని తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి విశాఖపట్నం రానున్నారని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యుల ఆధ్వర్యంలో మిగతా అధికారుల తో కలిసి ఈ యోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యతను యోగ ద్వారా అందరికి తెలియజేయడం, తద్వారా పర్యాటకం గురించి కూడా తెలిసేలాగా ఈ యోగ కార్యక్రమాన్నివిజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు వారి రోజు దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామం చేసేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. .
చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు అంతర్జాతీయ యోగా ఉత్సవాల సందర్భంగా చంద్రగిరి కోట నందు యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం చాలా అవసరం అని వివిధ రకాల మందులు వాడుతూ ఆరోగ్యం పాడవుతుందని యోగ చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దృఢ సంకల్పంతో యోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని తెలిపారు. ఈరోజు చంద్రగిరి కోట నందు యోగా కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు అని తెలిపారు. చంద్రగిరి కోట సంబంధించి లైట్ అండ్ సౌండ్స్ ప్రముఖమైన సంస్థ ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందని దాని ద్వారా చంద్రగిరి పర్యాటక ప్రదేశం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందని అన్నారు. ఇంకా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చంద్రగిరి కోట నందు చేయడం వలన ఇంకా అభివృద్ధి చెందే అవకాశముంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో యోగాంధ్ర మాసోత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలిపారు. ప్రాచీన కాలంలో ఋషులు యోగ చేసే వారని, యోగాను రోజువారి దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.
రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర మంతట పండుగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశుభ్రత, పచ్చదనం వంటి కార్యక్రమాలతో పాటు అందరి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ చూపిస్తున్నారని, అంతర్జాతీయ యోగ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతవిస్తూ ముందుకు తీసుకెళుతున్నారు అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టి యోగాను దినచర్యగా తీసుకోవాలని అన్నారు.
తుడా చైర్మన్ మాట్లాడుతూ.. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగ డే సందర్భంగా మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశమని తెలిపారు. ఈరోజు చంద్రగిరి కోటలో యోగాంధ్ర కార్యక్రమ నిర్వహించడం వలన పర్యాటకంగా అభివృద్ధి అవకాశం ఉంటుందని తెలిపారు. రోజువారి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడి కి గురి అవుతున్నారని దాని నుంచి బయటపడడానికి యోగ తప్పనిసరి అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యోగా గురువు చెప్పిన విధంగా ఆసనాలను ఆసక్తిగా వింటూ ప్రజలు, అధికారులు, యువత మహిళలు ఆసనాలు వేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ నరసింహులు, తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్ధన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు,మండల స్థాయి అధికారులు, మహిళలు, విద్యార్థులు, పాల్గొన్నారు.