రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడండి – పర్యాటకాన్ని పరిరక్షించండి.

Mounikadesk

మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడండి – పర్యాటకాన్ని పరిరక్షించండి.

ఒక యూనిట్ – ఒక మొక్క– ఒక హరిత బాధ్యత

డా. నూకసాని బాలాజీ

ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం – ప్రతి యూనిట్‌లో మొక్కలతో హరిత విప్లవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణను అభివృద్ధికి తోడుగా తీసుకుంటూ, ప్రతి పర్యాటక కేంద్రాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు చేయబడుతోంది.

ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  దూరదృష్టితో, పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వ ధ్యేయంగా మలుచుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని హరిత దిశలో నడిపిస్తున్నారు. వారి ప్రేరణతో, పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ సంవత్సరం జూన్ 5న ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది  “ఒక యూనిట్  ఒక మొక్క  ఒక హరిత బాధ్యత” అనే నినాదంతో.

ఈ సందర్భంగా, సంస్థ ఛైర్మన్ డా. నూకసాని బాలాజీ గారు మాట్లాడుతూ: “మన పర్యాటక స్థలాలు భద్రంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన పర్యావరణం అనివార్యం. ఈ రోజు ఒక మొక్కను నాటడం ద్వారా మనం భవిష్యత్ తరాలకు జీవించగల ప్రకృతిని అందించగలమని గుర్తించాలి. ఇది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు – ఇది మనందరి సామూహిక కర్తవ్యం. పర్యాటక అభివృద్ధి అంటే కేవలం భవనాలు కట్టడం కాదు – ప్రకృతిని కాపాడే పనులు చేయడం కూడా అనివార్యం.”

ఈ కార్యక్రమంలో ప్రతి యూనిట్ అధికారి, ఉద్యోగి తాము స్వయంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలి. పర్యాటక కేంద్రాలు స్థానిక వనరులను వినియోగిస్తూ, పర్యాటకులతో పాటు గ్రామీణ ప్రజలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలన్నదే సంస్థ లక్ష్యం.

మొక్కలు మన జీవన రేఖ హరిత భవిష్యత్తు కోసం ప్రతి అడుగులో ప్రకృతి పట్ల ప్రేమతో నడవాలి  

ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున ప్రజలందరికీ పిలుపు –  

“మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడండి – పర్యాటకాన్ని పరిరక్షించండి.”

Comments

-Advertisement-