శక్తి యాప్ సేవలు వినియోగించుకుని పోలీసు భద్రత పొందండి
శక్తి యాప్ సేవలు వినియోగించుకుని పోలీసు భద్రత పొందండి
- జిల్లా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు రిమ్స్ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 'శక్తి' యాప్ గురించి అవగాహన కల్పించిన 'శక్తి' బృందం
శక్తి యాప్ మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని
శక్తి టీమ్ మహిళా ఎస్.ఐ శాంతమ్మ పేర్కొన్నారు. శక్తి యాప్ ఆవశ్యకత,ప్రాధాన్యత గురించి శనివారం కడప నగరంలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాల విద్యార్థులకు 'శక్తి' టీమ్ మహిళా ఎస్.ఐ శాంతమ్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత. రక్షణ కొరకు అందుబాటులోకి తీసుకువచ్చిన 'శక్తి' యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో ప్రతి మహిళ, బాలికలకు, విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా శక్తి యాప్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ ఆపద సమయంలో మహిళలు బాలికలు కు ఈ శక్తి యాప్ ఎంతగానో ఉపయోగ పడుతుందని ప్రతి మహిళ విద్యార్థులు బాలికలు సెల్ఫోన్లో ప్లే స్టోర్ నందు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగత వివరాలు ఫోన్ నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి సూచించారు. ఎస్.ఓ.ఎస్ బటన్, డయల్ 112 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయగా పది నిమిషాల్లో మీ చెంతకు సంబంధిత పోలీస్ అధికారులు చేరుకొని మీయొక్క సమస్యను ,ఆపదను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతామని తెలిపారు.మహిళలు , చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాల పై డయల్ 100,112, చైల్డ్ లైన్ 1098, గృహ హింస 181, మహిళ వేధింపులు 1091,సైబర్ టోల్ ఫ్రి 1930, సైబర్ మిత్ర, సంబంధిత పోలీసు వారికి తక్షణమే సంప్రదించి పోలీసు వారు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా ఎస్.ఐ శాంతమ్మ సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.