రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మీడియా విశ్లేషణల పేరుతో మహిళలను కించపరిచడం హేయమైన చర్య

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మీడియా విశ్లేషణల పేరుతో మహిళలను కించపరిచడం హేయమైన చర్య

రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేవిధంగా, ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పనిసరి

-రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్  డా. రాయపాటి శైలజ

ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే మహిళలను కించపరుస్తూ సాగిన మీడియా విశ్లేషణను ఖండిస్తూ, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ శ్రీమతి డా. రాయపాటి శైలజ సోమవారం విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ప్రైవేట్ హోటల్లో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో చైర్మన్  డా. రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళలను దూషించడం సరైన పద్దతి కాదని, భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో రాజధాని ప్రాంత మహిళలను అవమానించడమే కాకుండా, అవహేళన చేయడం వారిని మరింత వేదనకు గురిచేసిందన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక రాజధాని ప్రాంత మహిళలకు మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం ఉన్న మహిళలకు వర్తిస్తుందని అన్నారు. వివిధ మీడియా వేదికలలో మహిళలను అవహేళన చేసి, వారిని మానసిక హింసకు గురిచేసే విషపు సంస్కృతికి గత పాలకులే తెర తీసారన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో రాజధాని ప్రాంత మహిళలు న్యాయం కోసం రోడ్లేక్కిన, ధర్నాలు చేసిన, పోలిసుల చుట్టూ మహిళా కమిషన్ చుట్టూ తిరిగిన ఎవరూ పట్టించుకోకపొగ వారిని మరిన్ని చిత్రహింసలకు గురిచేసారని, అందుకు సమాధానంగానే తమ ఓటు ద్వార గత పాలకులను అధికారం నుండి తొలగించారని అన్నారు. ప్రభుత్వం మారితే తమ భవిష్యత్తు బాగుపడుతుందని ఆశించిన రాజధాని ప్రాంత మహిళలకు ఇలాంటి మాటలు మరింత వేదనకు గురిచేస్తున్నాయని, రాజధాని ప్రాంతం పట్ల గత పాలకుల వ్యతిరేక వైఖరి మారడంలేదని విమర్శించారు. 

ఒక మీడియా ఛానల్ లో మహిళల పట్ల సంకుచిత భావాలు వ్యక్తం చేయడమే కాకుండా విద్వేషాలు రెచ్చగొట్టేలా సంభాషణలు సాగడం, ఈ విషయం పట్ల ఇంతవరకు సదరు వ్యక్తులు గాని, చానెల్ యాజమాన్యం గాని తగిన రీతిలో స్పందించకపోవడం విచారించదగ్గ విషయం అన్నారు. జర్నలిజం పేరుతో సమాజాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్న ఇలాంటి విశ్లేషకులపైన, పాత్రికేయుల పైన, చానళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని కోరుతామని, ఇలాంటి అసభ్య ప్రసారాలు చేసే టీవీ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ లకు వినతులు సమర్పించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఒక సుమోటోగా తీసుకున్నామని, న్యాయం కొరకు తమ పరిధిలో ఎంతవరకు కృషి చేయగలమో అన్ని విధాల ప్రయత్నించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయంలో చట్ట పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు స్పందించిన తీరుపై ఆమె హర్షం వ్యక్తం చేసారు. ఇప్పటికే ఈ సంబాషణలు చేసిన వారిపై, వారికీ సహకరించిన వారిపై పలు చోట్ల కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ విషయంలో మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, మీడియా యొక్క సహకారం కూడా కావాలని సమావేశం లో పాల్గొన్న పాత్రికేయులను చైర్మన్ . డా. రాయపాటి శైలజ కోరారు.

Comments

-Advertisement-