రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదటి దశ సమీక్ష పూర్తి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదటి దశ సమీక్ష పూర్తి

20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్

అమరావతి, జూన్ 9: మొదటి సంవత్సరం డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో అధికారుల సహకారంతో అన్ని జిల్లాల మొదటి దశ సమీక్షలు పూర్తి చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాల సమీక్షలలో పథకాల వారీగా గుర్తించిన అంశాలను ఆయన వివరించారు. 

2024 ఎన్నికల విజయం అనంతరం కేంద్రంలో ప్రధానిగా  నరేంద్ర మోడీ , రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా  నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారిరువురికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు నమో 3.O లో మొదటి సంవత్సరం పూర్తితో 11 సంవత్సరాలుగా అంత్యోదయ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు  పాలనలో మొదటి సంవత్సరం విధ్వంసం అయిన రాష్ట్ర భవిష్యత్ ని పునర్వ్యవస్థీకరణ చేయడానికి గరిష్ట సమయం సరిపోయిందన్నారు. ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మెన్ గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల అమలు తీరు పైన అధికారులతో రాష్ట్రంలోని 26 జిల్లాల సమీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏడాది కూటమి పాలనలో రాష్ట్రం స్వర్ణ ఆంధ్రా వైపు అడుగులు వేస్తున్నట్లు గుర్తించడమైందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజా సహకార పాలన సాగిస్తున్నదని, పెట్టుబడి దారులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడుతున్నారన్నారు. ఇప్పటి వరకు రూ.9.34 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు ఈ ఒక్క సంవత్సరం కూటమి పాలనలో జరిగాయయన్నారు. 25 లక్షల మందికి ఉద్యోగాల కల్పన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తోందన్నారు. 

రాజధాని అమరావతి నిర్మాణం , 120 బిలియన్ డాలర్ల ఆర్ధిక స్వాలంబన దిశగా విశాఖ రీజియన్ అభివృద్ధి , బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి మొదటి దశ పూర్తి, కొపర్తి-ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, బీపీసీఎల్ పెట్రో కాంప్లెక్స్ - సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమ మరియు రామాయపట్నం ఓడరేవు నిర్మాణం తో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు గుర్తించడమైందన్నారు. కేంద్ర పథకాలకు, ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వంలో మాచింగ్ గ్రాంట్లు సానుకూలంగా పెడుతుందని ఆయన తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ లో ఏపీ ని భాగస్వామ్యం చేయడానికి స్వర్ణాంధ్ర సాధన దిశగా నేడు 2.40 ట్రిలియన్ డాలర్లు ఆర్ధిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారన్నారు.

జిల్లాల సమీక్షలలో పథకాల వారీగా గుర్తించిన అంశాలను ఆయన వివరిస్తూ….

ఉపాధి హామీ….

2019 - 24 మధ్య ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం రాష్ట్రంలో అస్తవ్యస్తంగా సాగిందన్నారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, సత్యసాయి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య వంటి జిల్లాలలో మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం సక్రమంగా జరుగలేదు, ఈ అంశంలో నిధులను నష్ట పోకుండా వినియోగించు కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించామన్నారు. 

పీఎం ఆవాస్ యోజన….

కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో మొత్తం 21.37 లక్షల గృహాలు పట్టణాలలో ఇస్తే , 2024 నాటికి 8.75 లక్షల పూర్తి అయిన గృహాలలో నివసిస్తున్నట్లు డ్యాష్ బోర్డ్ లో చూపిస్తున్నా, మౌలిక సదుపాయాలు లేక అందులో నివసిస్తుంది ఎంత మంది అనే లెక్కలు తేలాల్సి ఉందన్నారు. నిధులను సమకూర్చి వివిధ శాఖలతో మౌలిక సదుపాయాలను కలిపిస్తే గాని ఈ గృహాలను లబ్ధిదారులకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడినట్లు ఆయన తెలిపారు. 2019 ముందు ఇచ్చిన ఎన్టీఆర్ హౌసింగ్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. 

టిడ్కో గృహాలు….

2.61 లక్షల గృహాలు లబ్ధిదారులకు మంజూరు చేస్తే, ఇప్పటివరకు నగర పాలక సంస్థలకు ఇచ్చింది 1,45,224 గృహాలు అయితే , లబ్ధిదారులు నివసిస్తున్న గృహాలు 87,168 అని, చివరి దశ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు అవసరం ఉందని ఆయన తెలిపారు. 

జల్ జీవన్ మిషన్ & అమృత్….

గత ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల అమలులో జాప్యం వల్ల ఆ ప్రాజెక్టుల వ్యయం భారీగా పెరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టు వ్యయం రూ.27 వేలకోట్లు అని, రూ.2700 కోట్లు మించి ఖర్చు చేయకుండా దాదాపు 65 నుండి 70 శాతం పనులు పూర్తి అయినట్లు తప్పుడు లెక్కలు చూపించారన్నారు.  

గతంలో జరిగిన తప్పులు సవరిస్తూ సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో వేల కోట్ల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సారథ్యంలో దీర్ఘకాలిక వనరుల లభ్యత ఆధారంగా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రారంభమైందన్నారు.

అమృత్ 1.0 లో 3,340 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభించినా, గత ప్రభుత్వ హయాంలో మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల పరిధిలో నివసిస్తున్న ప్రజలకు కనీస అవసరాలకు కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అమృత్ 2.0 లో 10,251 కోట్ల రూపాయల అంచనాతో దాదాపు అన్ని ముఖ్య మున్సిపాలిటీలలో త్రాగు నీరు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. అమృత్ నిధులలో కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక సంస్థల నిధులతో ప్రాజెక్టులు చేపట్టడం జరిగిందన్నారు. 

స్వయం సహాయక గ్రూపులు….

1.15 కోట్లకు పైగా మహిళలు దాదాపు 11 లక్షల స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారన్నారు. మా ప్రభుత్వంలో నారీశక్తి స్ఫూర్తి చాటుతూ మహిళలను దేశంలోనే అగ్రగామిగా దాదాపు 30 లక్షల “ లాక్ పతి దీదీ “ లను రాష్ట్రంలో తయారు చేయడం జరిగిందని, మరో 30 లక్షల మంది మహిళలను తయారు చేసే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయో వివరాలు ఇవ్వమని సెర్ప్ మరియు మెప్మా అధికారులను ఆదేశించడమయినదని ఆయన తెలిపారు. 

జాతీయ ఆహార భద్రతా…..

కేంద్రప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద 90 లక్షల కార్డులకు సంబంధించిన 2.70 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తుందన్నారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 55 లక్షల కార్డులకు 1.60 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తోందన్నారు. 

కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి,18 రకాల చేతి వృత్తుల వారికి సహాయంగా పీఎం విశ్వకర్మ మరియు నైపుణ్య శిక్షణ, కరెంట్ బిల్ ముక్తి లక్ష్యంగా పీఎం సూర్యఘర్ క్రింద 1 కేవీ కి 30 వేలు, 2 కేవీ కి 60 వేలు మరియు 3 కేవీ కి గరిష్టంగా 78 వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ లకు ఉచితంగా మరియు బీసీ లకు 20 వేలు అదనపు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

వ్యవసాయ రంగానికి సహాయం కోసం ఉచిత విద్యుత్ పంపిణీకై పీఎం కుసుమ్, పెట్టుబడి సహాయం క్రింద 6 వేలు రూపాయిలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఫసల్ భీమా యోజన క్రింద రైతులకు పంటలకు భీమా 2023 -24 లో అప్పటి ప్రభుత్వం నిర్లిప్తత వల్ల నష్టం జరిగిందని, అటువంటి నష్టం జరగకుండా అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమీక్షలో సూచించడం జరిగిందన్నారు. రాష్ట్రానికి రైతుల కోసం ఎరువుల సబ్సిడీ లక్షలాది మెట్రిక్ టన్నుల యూరియా పైన అందించడం జరిగిందన్నారు. 

పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రసాద్, స్వదేశీ దర్శన్, మూలధన వ్యయం సెకి క్రింద నిధులు అందుతున్నాయన్నారు. బాపట్ల సూర్యలంక, గండికోట, యాగంటి - అహోబిలం, అన్నవరం తదితర దేవాలయాలు మరియు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాయడం జరిగిందన్నారు. 

అదే విధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల ప్రగతిని ఆయన వివరిస్తూ……

పేదరికం రేటు అనూహ్యంగా తగ్గచున్నది…..

డబుల్ ఇంజన్ సర్కార్ కార్యక్రమాల అమలుతో పేదరికం రేటు అనూహ్యంగా దేశవ్యాప్తంగా తగ్గుదలతో వికసిత భారత్ వైపు వేస్తున్న అడుగులలో స్వర్ణాంధ్రా ది కీలక భాగస్వామ్యం కాబోతుందన్నారు. P4 ద్వారా సామాజికబాద్యత క్రింద సమాజంలోని ఉన్నత శ్రేణి వర్గాలు ద్వారా అట్టడుగున పేదరికంలో ఉన్న వారిని ఆదుకొనే ప్రయత్నం జరుగుచున్నదన్నారు.

నారీ శక్తి దిశగా అడుగులు….

నారీ శక్తి దిశగా అడుగులు - లాక్ పతి దీదీలుగా, డ్రోన్ దీదీలుగా, 1/3 వంతు ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ అడుగులు వేస్తోందన్నారు.

వికేంద్రీకరణ అభివృద్ధి…..

రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర , కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ జిల్లాల సమగ్ర అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ బాటలు వేస్తోందన్నారు.

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు….

డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు మరియు వైద్య శాఖ నోటిఫికేషన్ ద్వారా 4,500 పోస్టుల భర్తీ మరియు ప్రైవేట్ రంగం ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో డబుల్ ఇంజిన్ సర్కార్ పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ సమ్మిళిత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు.

Comments

-Advertisement-