వచ్చే పదేళ్ల వరకు రాష్ట్ర జీ డిపి కి కీలకం ప్రాథమిక రంగం లోని వ్యవసాయ ,అనుబంధ రంగాలు
వచ్చే పదేళ్ల వరకు రాష్ట్ర జీ డిపి కి కీలకం ప్రాథమిక రంగం లోని వ్యవసాయ ,అనుబంధ రంగాలు
బుడితి రాజశేఖర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయ సహకారం
ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ల శిక్షణలో తెలిపిన రాజశేఖర్
రాష్ట్ర జీడిపి లో 35 శాతం వాటా ప్రాథమిక రంగానిదే
స్థూల విలువ జోడింపు ఎక్కువగా ఉన్న ఉద్యాన సాగుపై రాబోవు 10 సంవత్సర కాలం దృష్టి పెట్టండి
వ్యవసాయ పంటల సాగు నుండి రైతులను ఉద్యాన పంటల సాగు మళ్లింపు చేపట్టేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలి.
పంటల ఉత్పత్తులు పచ్చి సరుకుగా,తక్కువ నిల్వ కాలపరిమితి కలిగి వాటిని నిల్వ చేసుకునే సౌకర్యం లేని ప్రస్తుత పరిస్థితులలో సాగు లో లాభసాటి విధానమునకు పంట కోత అనంతర ప్రాసెసింగ్ విధానాలలో నూతన ఉత్తమ పద్ధతులు ప్రవేశపెట్టి స్థూల విలువ జోడింపు పెంచాలి .
ప్రకృతి వ్యవసాయం వైపు ప్రత్యేక దృష్టి పెట్టాలని,ఆ విధానం విబిన్న వాతావరణ పరిస్థితులకు తట్టుకుని దిగుబడులను నిలకడగా సాధిస్తాయి
ప్రస్తుత మార్కెట్ ధరలలో గరిష్టంగా వున్న పంటల పై తదుపరి సీజన్ లలో మితిమీరి ఆ పంటలను సాగు చేసే అలవాటును రైతులలో మార్పు తీసుకు రావాలని తెలియ చేశారు
బుధవారం రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల కార్యాలయం లో 2024 బ్యాచ్ కు సంబంధించి వివిధ ఏడు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టరులుగా పనిచేస్తున్న ట్రైనీ కలెక్టర్ లకు వ్యవసాయ ,అనుబంధ రంగాలపై రాబోవు పది సంవత్సరాల కాలం ఊహించి ,వారికి తదనుగుణంగా వ్యవసాయ రంగములో అవసరాలు ,పరిస్థితులపై వారిలో అవగాహన కల్పించే విధముగా శిక్షణ ఇవ్వటం జరిగింది.
డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ మే నెల 12 నుండి 8 జూన్ వరకు రాష్ట్రములో వివిధ ప్రాంతాలలో, ప్రభుత్వ రంగాలలో అసిస్టెంట్ కలెక్టర్ లు శిక్షణ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యములో శిక్షణ ఇస్తున్నారని ,వాటిలో భాగముగా ఈ రోజు ప్రాథమిక మిషన్ లోని వ్యవసాయ అనుబంధ రంగం లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు .వ్యవసాయ విస్తరణ ,వనరుల పంపిణీ ,ఎరువులు ,విత్తనాలు నాణ్యతా ప్రమాణాలు,నియంత్రణ ,రాష్ట్ర ,జాతీయ స్థాయి వ్యవసాయ పథకాలు ,రైతు సంక్షేమ పథకాలను తెలియచేశారు .
ఉద్యాన సంచాలకులు శ్రీనివాసులు వారి శాఖాపరమైన వివరాలు తెలియచేశారు .