రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

యోగాంధ్రతో పలుప్రపంచ రికార్డులు సాధించి ఎపిని దేశంలో మొదటి స్థానంలో నిలపాలి:సిఎస్

InternationalYogaDay yogandhracampaign yogandhrapratibha Yogandhra AndhraPradesh yoga 11th national yoga National yoga day About yoga
Mounikadesk

యోగాంధ్రతో పలుప్రపంచ రికార్డులు సాధించి ఎపిని దేశంలో మొదటి స్థానంలో నిలపాలి:సిఎస్

అమరావతి,18 జూన్:ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం కేంద్రంగా,రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం ద్వారా పలు ప్రపంచ రికార్డులు సాధించడం తోపాటు ఎపిని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు.యోగాంధ్ర కార్యక్రమంపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులు,జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయని రానున్న మూడు రోజులు నిరంతరం కృషి చేసి ఈకార్యక్రమాన్ని పూర్తిగా విజయంతం చేసేలా అన్ని శాఖల అధికారులు పని చేయాలని సూచించారు.ముఖ్యంగా అధిక సంఖ్యలో యోగా కార్యక్రమంలో పాల్గోవడం,ఎక్కువ వేదికల్లో యోగాను నిర్వహించడంలోను,సర్టిఫికెట్ల జారీ వంటి పలు అంశాల్లో వీలైనన్నిఎక్కువ ప్రపంచ రికార్డులు సాధించి యోగాలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ను మొదటి స్థానంలో నిలపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు.

ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో జరిగే ప్రధాన ఈవెంట్ తో అనుసంధానిస్తూ యోగా ప్రోటోకాల్ పాటిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 5000 మందితో ఒక ప్రధాన యోగా ఈవెంట్ ను నిర్వహించడంతో పాటు గ్రామ స్థాయి వరకూ వివిధ వేదికల్లో యోగాను నిర్వహించేలా చూడాలని జిల్లా కలక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 50 వేలకు పైగా వేదికల్లో ఈయోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుండగా ఇప్పటికే లక్షా 28 వేల వేదికలు రిజిష్టర్ అయినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందికి పైగా పౌరులు పాల్గొనేలా ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని ఆదిశగా తగిన ఏర్పాట్లు అన్ని పూర్తి కావచ్చాయని చెప్పారు.ఈ వేదికల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైవ్ స్క్రీనింగ్,తాగునీరు వంటి ఏర్పాట్లు కల్పించేందుకు కలక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో పాల్గొనేవారి సంఖ్యతో పాటు ఫోటోలను ఇన్‌ఛార్జ్ లాగిన్‌లో అప్‌లోడ్ చేయాలని,ఈవెంట్‌లో పాల్గొనే అన్ని వేదికల్లో డేటా ఎంట్రీ సరిగ్గా జరిగేలా జాగ్రత్త తీసుకోవాలని అప్పుడే ప్రపంచ రికార్డులు సాధించేందుకు అవకాశం ఉంటుందని సిఎస్ తెలిపారు. 

వరసగా మూడు రోజలపాటు యోగాసనాల్లో పాల్గొన్న వారికి ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్లు జారీపై జిల్లా కలెక్టర్లందరూ ప్రత్యేక దృష్టి పెట్టి ఈనెల 19వతేదీకి ఆప్రక్రియను పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.మాస్టర్ ట్రైనర్లకు సర్టిఫికెట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నుండి జారీ చేయబడతాయని వాటని డౌన్‌లోడ్ చేసుకోవాలని మాస్టర్ ట్రైనర్లకు చెప్పాలన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీలను ఇప్పటికే పూర్తి చేశామని వాటిలో గెలుపొందిన విజేతలను అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 20వతేదికి వారిని విశాఖపట్నం తీసుకురావడానికి అందరు జిల్లా కలక్టర్లు తగిన ఏర్పాట్లు చేయాలని ఇందుకై ప్రత్యేకంగా ఒక ఇన్చార్జిని ఏర్పాటు చేయాలని చెప్పారు.అన్నిపాఠశాలలు కళాశాలలు మరియు ఇతర సంస్థలను యోగా నిర్వహణ వేదికలుగా నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.రానున్న మూడు రోజుల్లో అన్నివిద్యా సంస్థల విద్యార్థులు అందరికీ యోగా ప్రదర్శనలు మరియు తరగతులు నిర్వహించాలన్నారు.

ఈవీడియో సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర నోడలు అధికారి యం.టి.కృష్ణ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ప్రధాన ఈవెంట్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకూ విజయవంతంగా నిర్వహించేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని తెలిపారు.ఇంకా ఈసమావేశంలో పలువురు అధికారులు,జిల్లా కలక్టర్లు తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.

ఈనెల 23న అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం:సిఎస్

 ఈనెల 23వతేదీ సోమవారం రాష్ట్ర సచివాలయం వెనుకవైపున ఇటీవల ప్రధానమంత్రి సభ జరిగిన వేదిక వద్ద సుపరిపాలనలో తొలి అడుగు ఏడాది పాలన కార్యక్రమంపై సభా కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి యోగాంధ్ర కార్యక్రమంపై కలక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన ఈఅంశాన్ని వెల్లడించారు.23వ తేదీ సోమవారం సాయంత్రం 5గం.ల నుండి రాత్రి 8గం.ల వరకూ ఈకార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

Comments

-Advertisement-