రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వంలో పెద్దపీట

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వంలో పెద్దపీట

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, రైళ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ అనుసంధానంతో పాటు వాటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.. గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కలిపి మొత్తంగా 20 కి తగ్గకుండా.. అదే సమయంలో ఖచ్చితంగా 14 ఎయిర్ పోర్టులు ఉండే విధంగా భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నామన్నారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు.. 

ఎయిర్ పోర్టుల TEFR తయారీకి కన్సల్టెంట్ల ఎంపిక టెండర్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని నాగార్జున సాగర్‌, ఒంగోలులో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టుల అభివృద్ధి కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబులిటీ స్టడీ రిపోర్ట్ (TEFR) తయారీకి కన్సల్టెంట్ ఎంపిక కోసం టెండర్ ప్రక్రియను చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్లు మంత్రి తెలిపారు. ఈ రెండు ఎయిర్ పోర్ట్ ల అభివృద్ధిలో భాగంగా ఆయా జిల్లా కలెక్టర్ ల ఆధ్వర్యంలో ఇప్పటికే అనుకూలమైన ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు.. వీటికి సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ముందస్తు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని కూడా పూర్తి చేసిందని తెలియజేశారు.. ఇప్పటికే అమరావతి, కుప్పం ఎయిర్ పోర్టుల అభివృద్ధికి టెక్నో ఎకనామిక్ ఫీజిబులిటీ స్టడీ రిపోర్ట్ (TEFR) తయారీకి కన్సల్టెంట్ ఎంపిక కోసం టెండర్ ప్రక్రియకు ఆమోదం తెలిపామన్నారు. 

కర్నూలు ఎయిర్ పోర్టులో 2 అభివృద్ధి పనులకు అనుమతి

2025-26 ఆర్థిక సంవత్సంలో కర్నూలు విమానాశ్రయం కార్యకలాపాల కోసం 2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతిని ఇచ్చిందని తెలిపారు.. 1) రన్‌వేస్ ఎండ్ సేఫ్టీ (RESA) సరిదిద్దడానికి, ఇతర నిర్వహణ పనులకు రూ. 3.6 కోట్లు... 2) కర్నూలు ఎయిర్ పోర్టులో టాక్సీవే టు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) అందించడం కోసం రూ. 4.433 కోట్లకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు....

ఎయిర్ పోర్టు కన్సల్టెంట్ల ఎంపిక కోసం 12 మందితో కమిటీ ఏర్పాటు

రాష్ట్రంలో ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన విమానాశ్రయ ప్రాజెక్టులకు కన్సల్టెంట్లు మరియు డెవలపర్ల ఎంపిక కోసం వచ్చిన బిడ్‌ల పరిశీలన కోసం ప్రభుత్వం 12 మందితో కూడిన టెక్నికల్ ఎవాల్యుషన్ కమిటీని పునర్ నియమించినట్లు మంత్రి తెలిపారు.. 

రూ. 70.82 కోట్ల పైబర్ నెట్ బిల్లుల చెల్లింపులకు అనుమతి

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో (APSFL) గతంలో 29 సంస్థలకు చెల్లించాల్సిన రూ. 70.82 కోట్లకు బిల్లులు అందజేయడానికి ఆమోదం తెలపడం జరిగింది..

వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి సాగర మాల సమావేశం

రాష్ట్రంలో సాగరమాల ప్రాజెక్టు కింద చేపడుతున్న పనుల పర్యవేక్షణ, అభివృద్ధి, పురోగతి, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల ప్రతిపాదనలు వంటి పలు అంశాలపై చర్చించేందుకు వచ్చే నెల 4 వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా తన అధ్యక్షతన 7 వ రాష్ట్ర స్థాయి సాగరమాల సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలియజేశారు..

Comments

-Advertisement-