నేను ఆలమూరులో ఎవరి భూములు ఆక్రమించలేదు... అసత్య ఆరోపణలు చేయొద్దు ..
నేను ఆలమూరులో ఎవరి భూములు ఆక్రమించలేదు... అసత్య ఆరోపణలు చేయొద్దు
- సక్రమంగా అన్ని హక్కులు ఉన్న భూములు మాత్రమే కొన్నా..
- కె ఎం షఫీ వుల్లా గారి మరియు మాజీ ఎంపీ కెఎం సైపుల్లా గారికి సంబంధించిన సక్రమమైన భూములే మా కళాశాలకు కొనుగోలు చేశా.
- ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన భూములు లేవు.
- నా ప్రతిష్టకు భంగం కలిగించే వ్యవహరిస్తూ నాపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టపరంగా ముందుకు వెళ్తా.
- మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
అనంతపురం: 13
ఎంతో వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ కళాశాల మరియు హార్టికల్చర్ కళాశాలను స్థాపించాలనే లక్ష్యంతో గౌరవనీయులు కే యం షఫీవుల్లా గారు మరియు కేఎం సైఫుల్లా మాజీ ఎంపీ గారికి సంబంధించిన అన్ని హక్కులు కలిగిన వారి పూర్వీకుల ఆస్తి 204 ఎకరాలు బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఆ కళాశాల నిర్మాణానికి ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మొదటి దశలో 117 ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ 50 14 /2016
రెండవ దశలో 86.99 ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ 7779/2016 లో బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీపై భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు కే యం షఫీవుల్లా, కే యం సైపుల్ల గారి నాన్న అరహంతుల్లా మాజీ ఎంపీ కుటుంబానికి చెందినవారు. ఎంతో ఉన్నతమైన కుటుంబం వారిది .నవాబుల కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం . పేదల కడుపు కొట్టి ఎవరి భూములు తీసుకోవలసిన అవసరం ఆ కుటుంబానికి గాని నాకు కానీ అవసరం లేదు. మరీ ముఖ్యంగా గౌరవనీయులు కే యం షఫీవుల్లా గారు ,కేఎం సైఫుల్ల గారి లాంటి వాళ్లు ఎంతో ఉన్నతమైన కుటుంబానికి చెందిన వారి ఆస్తులు ఒక మంచి కలశాల నిర్మాణానికి ఆలమూరు వద్ద వారి హక్కు కలిగిన 204 ఎకరాల భూమిని మా సంస్థ అయిన బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ కి ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయించారు.
అయితే ఈ భూములు పరిశీలించిన తర్వాత వీటికి కొనకముందే జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ,ఆర్డిఓ మధుసూదన్ ,తహసిల్దార్ ,విఆర్ఓ సర్వేయర్ ద్వారా ప్రభుత్వ రికార్డులు పరిశీలించిన తర్వాతనే ఇవి సక్రమైనవే అని రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే వాటిని ఆ కళాశాల నిర్మాణానికి బాలాజీ సొసైటీ ద్వారా కొనడం జరిగింది. ఈ భూముల్లో ఏ ఇతరులకు సంబంధం లేదు. వారు ఆరోపిస్తున్న వాటిలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు సంబంధించిన భూములు లేవని అలాంటి భూములు ఆక్రమించుకోవాల్సిన అవసరము కూడా నాకు లేదు.
ఎస్సీల భూములు ఆక్రమించానని ఆరోపణ చేశారు. నేను ఎస్సీ ఎస్టీ బీసీలకు సహాయం చేసే వ్యక్తినే కానీ వారి భూములు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా సొంత గ్రామమైన పల్లెవాండ్లపల్లిలో నా స్వంతమైన 5 ఎకరాల భూమిని ఎస్సీల ఇళ్ల స్థలాలకు కోసం ఉచితంగా దానం చేయడం జరిగింది. ఇలా ఎస్సీల ,ఎస్టీ ,బీసీ భూమిని ఆక్రమించుకోవాల్సిన అవసరము నా జీవిత చరిత్రలో లేదు.
జూన్ 12న ఆలమూరు చెందిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అనంతపురం ప్రెస్ క్లబ్ బుక్ వచ్చి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మా భూములు ఆక్రమించారని నాపైన ,నా కళాశాల పైన నా భూములపైన చాలా సార్లు పదేపదే ఆరోపణ చేస్తూ వస్తున్నారు.
కాబట్టి వాటిలో నిజం ఎంత తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది.
ఈ ఆరోపణ చేస్తున్న వారిలో మాకు 1976 లో ల్యాండ్ సీలింగ్ లో పట్టాలు ఇచ్చారని చెబుతున్నారు. అయితే నేను ఈ భూమి కొనుగోలు చేయక ముందు గతంలో జరిగిన విషయాలు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే..
ఏలూరు వెంకన్న అనే వ్యక్తి ఏమాత్రం సంబంధం లేని భూములను ల్యాండ్ సీలింగ్ కింద చూపించారు. ఈ ల్యాండ్ సీలింగ్ కింద ఇచ్చిన వాటికి పట్టాలిపించారు. వీటిపై గౌరవనీయులు కేఎం షఫీవుల్లా గారు మరియు కేఎం సైఫుల్లా మాజీ ఎంపీ గారు ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఏలూరు వెంకన్న సరెండర్ చేసిన భూములు కే యం షఫీ వుల్లా మరియు కేఎం సైఫుల్లాకు భూమిపై హక్కులు కలిగి ఉన్నాయని, మరి ఇతరులెవరికి ఆ భూములు చెల్లవని, ఆ పట్టాలు కూడా రద్దు చేస్తూ 24 /5/ 1988 ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబనల్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత వేలూరి వెంగన్న గారు తదుపరి హైకోర్టుకు వెళ్లినప్పటికీ అక్కడ కూడా ఇవి చెల్లవని తీర్పు ఇవ్వడం జరిగింది.
తదుపరి వ్యక్తులు స్థానిక అనంతపురం అప్పటి ఆర్డీవో మధుసూదన్ గారికి కూడా అప్పీలు చేసుకోవడం జరిగింది.ఆర్డీఓ మధుసూదన్ గారు 19/12 22 న డి ఐ ఎస్ నెంబర్ డి 2బి _1004/2022 వీటిపై విచారం చేసి శ్రీబాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ కళాశాల కొన్న భూములు సక్రమమైనవే అని నిర్ధారించడం జరిగింది. ఈ కళాశాల ఆధీనంలో ఉన్న భూముల్లో ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు సంబంధించిన భూములు లేవని నివేదికలు కూడా ఆర్డీఓ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత ఓ నాయకుడు సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో వీటిపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా రెవెన్యూ అధికారులను కోరడం జరిగింది. స్థానిక తహసిల్దార్ ఈ భూములపై విచారణ చేసి 22/12/2020 న ఈ భూములు కేం షఫీ ఉల్లా మరియు సైఫుల్ల వారి హక్కు కలిగిన భూమిని బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ కొనుగోలు చేసిన భూమి సక్రమైనదే అని ఇతరుల భూమి లేదని అప్పటి తాహసిల్దార్ కూడా ఈ విచారణ లో నివేదికలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అప్పటి జిల్లా కలెక్టర్ ఈ భూములు ప్రభుత్వ అసైన్డ్ భూమి కాదు ఏ ఇతర వ్యక్తులకు సంబంధించింది కాదనీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ కేం షఫీ వుల్లా, సైపుల్లా నుంచి కొనుగోలు చేసిన భూమి అని కలెక్టర్ స్పష్టంగా నివేదిక ఇవ్వడం జరిగింది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ద్వారా అన్ని సక్రమమని నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా పదేపదే మాజీ పల్లె రఘునాథ్ రెడ్డి పైన బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీపైన కొందరు లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచిస్తున్నాను.
మాపై అక్రమ కేసులు పెట్టారని వారు చేసిన ఆరోపణలు నిజం కాదు.
బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నడుస్తున్న కళాశాలలో ఇతరులకు సంబంధించిన ఎవరి భూమి లేదని న్యాయస్థానాలు ,జిల్లా రెవెన్యూ అధికారులు స్పష్టంగా తగిన ఉత్తర్వులు నివేదికలు ఇచ్చినప్పటికీ ఇంకా పదేపదే తమకు పట్టాలు ఇచ్చారని కళాశాల భూముల్లోకి అక్రమంగా ఎంతో దౌర్జన్యంగా చొరబడి కళాశాలకు సంబంధించిన ప్రహరీ ఫెన్సింగ్ వాటికి సంబంధించిన 328 స్తంభాలు, 1,80,000 విలువచేసే ఆస్తిని నష్టపరచడం జరిగింది. అంతేకాకుండా కళాశాల సిబ్బందిపై కూడా వారు దౌర్జన్యంగా దాడి చేయడం జరిగింది. ఈ విషయంపై అప్పటి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు కోర్టులో వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది.అంతే తప్ప ఈ భూములపై కాదు. ఇవి జరిగిన వాస్తవ విషయాలు .
ఈ కొందరు వ్యక్తులు లేనిపోని వ్యక్తుల మాటలు నమ్మి వారి ప్రోద్భలంతో నాపై అనవసర ఆరోపణలు చేస్తూ వీటిని అంటగట్టి కొందరి అమాయకులను బలి చేస్తున్నారు. వీరి వెనుక ఉన్న వ్యక్తులకు ఒకటే చెబుతున్నా.
పల్లె రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి కాదు ఒక వ్యవస్థ .
లక్షలాదిమంది విద్యార్థులకు చదువు చెప్పిన వ్యక్తిని. నీతి నిజాయితీతో సమాజంలో ఒక గౌరవమైన స్థానంలో ముందుకు పోతున్నాను. నీతి తప్పి బతకాల్సిన అవసరం లేదు. నేను కళాశాలల కోసం కొన్న భూములు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం అన్నీ లీగల్ గా చూసుకున్న తర్వాతనే సక్రమమైన భూములు అని నిర్ధారించుకున్న తర్వాతనే కొనుగోలు చేశాను తప్పితే ఎవరి భూములు ఆక్రమించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇంకా అనుమానం ఉంటే నా కళాశాల భూములు ఎవరైనా పరిశీలించుకోవచ్చు .అన్ని రికార్డులు సక్రమంగానే నా వద్ద ఉన్నాయి. పేదల భూములు ఆక్రమించుకోవాల్సిన గత్యంతరం నాకు ఎప్పుడు పట్టలేదు. కేవలం నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా పదేపదే లేనిపోని ఆధారాలు లేని విషయాలను కొన్ని మీడియా ద్వారా సోషియల్ మీడియాలో కొందరితో చెప్పించడం పనికిమాలిన చర్య.
ఇకపై నా వ్యక్తిగత ప్రతిష్టకు మరియు నా కళాశాలల ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తే అలాంటి వ్యక్తులపై చట్ట ప్రకారం మరియు న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకునేందుకు వెనకాడనని ఎవర్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
పేర్కొన్నారు.
పల్లె రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తో సమాజానికి ,రాష్ట్ర ప్రజలకు ,పుట్టపర్తి నియోజవర్గ ప్రజలకు బాగా తెలుసు అన్నారు.
ముఖ్యంగా కొందరికి సూటిగా చెప్తున్నా .నా మంచి తనం చేతకాని తనంగా భావించవద్దు.
అదే పనిగా నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కొంతమంది ప్రోత్బలంతో వెనక ఉండి కుల సంఘాలను అడ్డంపెట్టుకుని కరపత్రాల ద్వారా సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే సహించే ప్రసక్తే లేదు . అలాంటి వారిని ఉపేక్షించను. ఎవరిని కూడా వదిలిపెట్టను. చట్టపరంగా చర్యలు తీసుకుంటా. సివిల్ యాక్ట్ ప్రకారం వారిపై అన్ని విధాలుగా ముందుకు వెళ్తానని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు.