రేపు అనంతలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా
InternationalYogaDay
yogandhracampaign
yogandhrapratibha
Yogandhra
AndhraPradesh yoga
11th national yoga
National yoga day
About yoga
Health tips yoga
By
Mounikadesk
రేపు అనంతలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా
- పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహణ
- లోటుపాట్లు లేకుండా తక్షణమే ఏర్పాట్లు పూర్తి చేయాలి
- వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, జూన్ 13 :ఈనెల 14న అనంతపురం నగరంలో దివ్యాంగులతో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమం కోసం లోటుపాట్లు లేకుండా తక్షణమే ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈనెల 14వ తేదీన దివ్యాంగులతో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్రలో భాగంగా నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు దివ్యాంగులతో నిర్వహించే రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. యోగా చేసేందుకు వీలుగా పెరేడ్ గ్రౌండ్లో మ్యాట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకోసం దివ్యాంగులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఆయా మండలాలు, గ్రామాల నుంచి దివ్యాంగులను తీసుకువచ్చేందుకోసం రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని, వారిని జాగ్రత్తగా తీసుకువచ్చి, తీసుకువెళ్లేలా ఎక్కడ సమస్య రాకుండా అధికారులు పక్కా ప్రణాళికతో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే జిల్లా అధికారులు, సిబ్బంది అందరూ ఐడి కార్డులను ధరించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యచరణ ప్రణాళిక పూర్తిగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఉదయం 6:30 గంటలకల్లా పెరేడ్ గ్రౌండ్ కి చేరుకోవాలన్నారు. ఎలాంటి పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, సెక్యూరిటీ పకడ్బందీగా ఉండాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని, ప్రోటోకాల్ ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలన్నారు. గ్రౌండ్ లో 4 ఎల్ఈడి స్క్రీన్స్, 10 మొబైల్ టాయిలెట్స్, మైక్ అరేంజ్మెంట్స్ చేయాలని సూచించారు. ఒకవేళ వర్షం వస్తే నగరంలోని ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యోగా చేయడం ద్వారా కలిగే ఉపయోగాలు గురించి దివ్యాంగులకు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేసేలా యోగాసనాలు చేయించాలన్నారు. కార్యక్రమానికి వచ్చే వారికోసం టిఫిన్, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. గ్రౌండ్లో మెడికల్ క్యాంపులు, 108 వాహనం ఏర్పాటు చేయాలని, కార్యక్రమంలో పాల్గొనే వారికి అందించేందుకు సర్టిఫికెట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం కోసం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి దివ్యాంగుల యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు కోసం ఈనెల 14వ తేదీన మండలాలు, మున్సిపాలిటీలలోని సచివాలయాల్లో ట్రయల్ రన్ గా వెన్యూ రిహార్సల్స్ చేయాలని, ఈ విషయమై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు మానిటర్ చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మాలోల, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి వినోద్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఆర్డీఓలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆయుష్ అధికారులు, యోగా గురువులు పాల్గొన్నారు.
Comments