రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రత్యేక బృందం ద్వారా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ

Mounikadesk

ప్రత్యేక బృందం ద్వారా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ

 2 నెలల వ్యవధిలో వాట్సప్ మొబైల్ నెంబర్ మరియు CEIR పోర్టల్ ద్వారా సుమారు 1 కోటీ 20 లక్షల రూపాయల విలువ గల 601 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి, పోగొట్టుకున్న/దొంగలించబడిన మొబైల్ ఫోన్ల ను భాదితులకు అందజేత.

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో –7వ విడత " మొబైల్ ఫోన్ల రికవరీ మేళా..

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ .విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ గారు.

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 2024 నవంబర్ నుండి మే నెల 2025 వరకు 13 వందల మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు/ దొంగలించబడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ గారు ఒక ప్రత్యేక బృందాన్ని 5/5/2025 వ తేదీన ఏర్పాటు చేశారు. 

కేవలం 1 నెల రోజుల వ్యవధిలో మొబైల్ ఫోన్ల ను అన్నమయ్య జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్.మహమ్మద్ అలీ, మరియు టెక్నికల్ అనాలిసిస్ వింగ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి.జాన్ జోసఫ్ ఆధ్వర్యంలో.. సైబర్ క్రైమ్ సిబ్బంది మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సంయుక్తంగా 601 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు, వాటి యొక్క విలువ సుమారు 1 కోటీ 20 లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ. వి.విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ గారు తెలియజేశారు. 

ఇప్పటివరకు మొత్తం 7 విడతలలో 1627 మొబైల్ ఫోన్లను (వాటి విలువ సుమారు 3 కోట్ల 16 లక్షల రూపాయలు) రికవరీ చేయడం జరిగిందని, రికవరీ చేసిని మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయడం జరుగుతుందని, బాధితులు మొబైల్ పోయిందని కంప్లైంట్ చేసి ఉంటే, పోయిన మొబైల్ దొరికి ఉంటే వారికి సమాచారం ఇచ్చి పిలిపించి నిర్ధారించుకొని మొబైల్ అప్పగించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

1. మొదటి విడత 109 ఫోన్లు విలువ 23 లక్షల రూపాయలు.

2. రెండవ విడత 130 ఫోన్లు విలువ 26 లక్షల రూపాయలు.

3. మూడవ విడత 165 ఫోన్లు విలువ 33 లక్షల రూపాయలు.

4. నాలుగవ విడత 170 ఫోన్లు విలువ 30 లక్షల రూపాయలు.

5. ఐదవ విడత 200 ఫోన్లు విలువ 44 లక్షల రూపాయలు.

6. ఆరవ విడత 252 ఫోన్లు విలువ 40 లక్షల రూపాయలు.

7. ఏడవ విడత ఈ రోజు 601 ఫోన్లు విలువ 1 కోటీ 20 లక్షల రూపాయలు 

మొత్తం నేటి వరకు 1627 మొబైల్ ఫోన్లు. వాటి విలువ సుమారు 3 కోట్ల 16 లక్షల రూపాయలు ఉంటుంది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో మొబైల్ ఫోన్ పోతే జిల్లా పోలీస్ LMTS వాట్సాప్ నెంబర్ 8688830012 కు “Hai” అని మెసేజ్ చేసిన వెంటనే మీరు ఒక గూగుల్ లింకు ను రిసీవ్ చేసుకుంటారు. ఆ లింకును క్లిక్ చేసి మీ యొక్క వివరములు మరియు మీ మొబైల్ యొక్క IMEI నంబర్ లు మొదలగు వివరములను తెలియపరుస్తూ ఆ మొబైల్ ను కొన్న బిల్ పేపర్, లేదా మొబైల్ బాక్స్ ను మీరు అప్లోడు చేసి సబ్మిట్ చేయవలెను. లేదా CEIR https://www.ceir.gov.in/Home/index.jsp లింకును నొక్కడం ద్వారా పోయిన మొబైల్స్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్ఐఆర్ కట్టకుండా, పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా సులభతరం చేశాం.

భాదితులు పోగుట్టుకున్న మొబైల్ ఫోన్ల యొక్క వివరాలను బట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, వాటిని వెతికి సేకరించి ఎటువంటి రుసుము చెల్లించనక్కరలేకుండా బాధితులకు అందజేస్తున్నాం.

ప్రస్తుత కాలంలో సమాచార చేరవేతకు, వినోదానికి, విజ్ఞానం కొరకు, ఇతర అత్యవసర సమాచారం కోసం మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చాలా సందర్భాల్లో ప్రజలు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకోవడం లేదా దొంగలింపబడటం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటిలో వ్యక్తిగత, బ్యాంకు, ఇతర గోప్యమైన వివరాలు ఉండవచ్చు. నేరస్తులు వాటిని దుర్వినియోగ పరచవచ్చు. ఈ క్రమంలో ఏమి చేయాలో దిక్కు తోచలేని పరిస్థితుల్లో బాధితులు పోలీసు వారిని ఆశ్రయిస్తున్నారు.

మొబైల్ ఫోన్ పోగుట్టుకున్నను లేదా దొంగలించబడినా తీసుకోవలసిన జాగ్రత్తలు.

 1. మీ యొక్క మొబైల్ నెంబర్ ను వెంటనే ఆలస్యం చేయకుండా బ్లాక్ చేయాలి.

2. మీ యొక్క మొబైల్ పాస్వర్డ్ , ఫోన్ పే, గూగుల్ పే, పేటియం, మరియు ఇతర బ్యాంకు అకౌంట్స్ కు సంబంధించిన వివరాలను బ్లాక్ చేపించాలి. 

3. మొబైల్ ఫోన్ పోగుట్టుకున్నను లేదా దొంగలించబడినా మీరు వెంటనే అన్నమయ్య జిల్లా LMTS వాట్సాప్ నెంబర్ 8688830012 కు గాని లేక CEIR పోర్టల్ నందు మీరు కంప్లైంట్ రైజ్ చేయవలెను.

సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయరాదు, అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కల్గిన బాక్సు ఉంటేనే కొనుగోలు చేయాలి.

అపరిచితులతో ఫోన్ కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు.. అటు కొన్న వ్యక్తి కూడా నష్టపోతాడని గుర్తించాలి.

ప్రజలు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నను లేదా దొంగలించబడిన వాటి కోసం జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాలు. ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా మొబైల్ ఫోన్ల ను రికవరీ చేయడం జరిగింది. బాధితులకు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ను అప్పగిస్తారు. చాలా సందర్భాల్లో పోగొట్టుకున్న వారి కొన్ని మొబైల్ ఫోన్ల లో ఎటువంటి అత్యవసర సమాచారం కోల్పోకుండా డాటా తో కూడిన మొబైల్ ఫోన్ల ను బాధితులకు అందజేయడం జరిగింది.

మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు, మొబైల్ ఫోన్లు రికవరీ చేసి వారికి అందజేయడంతో బాధితులు జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారికి, అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతఙ్ఞతలు తెలిపారు.

మొబైల్ ఫోన్ల ను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో కృషి చేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్.మహమ్మద్ అలీ, టెక్నికల్ అనాలసిస్ వింగ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి.జాన్ జోసప్, సైబర్ క్రైమ్ సిబ్బంది, మొబైల్ రికవరీ బృందాలను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బందికి రివార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించారు. 

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు. పి . రాజా రమేష్, కె.రాజారెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ యం. తులసీరాం, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు మధు, రాఘవ రెడ్డి , మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, శంకర మల్లయ్య , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, పెద్దయ్య, ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-